రీసెంట్ గా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన మాస్ మహరాజ్ రవితేజ కెరియర్ సంక్షోభంలో ఉన్నప్పుడు అంధుడిగా సినిమా చేసి అదరహో అనిపించాడు. ఇక సినిమాలో రవితేజ గుడ్డి వాని పాత్ర అన్న కాన్సెప్ట్ ఒక్కటే తప్ప మిగతా అంతా రెగ్యులర్ రవితేజ సినిమాలానే వచ్చింది. 


ఇక ఈ సినిమాతో పాటుగా విక్రం సిరి డైరక్షన్ లో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. ఆ సినిమా కూడా దాదాపు పూర్తి కావొచ్చిందని అంటున్నారు. ఇక ఆ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయబోతున్నాడట రవితేజ. సోగ్గాడే చిన్ని నాయనా అంటూ నాగార్జునతో సూపర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తీసి హిట్ అందుకున్నాడు.


కళ్యాణ్ కృష్ణ రవితేజకు సరిపోయే ఓ క్రేజీ స్టోరీ వినిపించాడట. తీసిన రెండు సినిమాలు హిట్టే కాబట్టి రవితేజ కళ్యాణ్ కృష్ణ సినిమా దాదాపు కన్ఫాం అనేస్తున్నారు. మాస్ రాజాతో సోగ్గాడు డైరక్టర్ అనగానే ఆ ప్రాజెక్ట్ మీద అంచనాలు పెరిగాయి. ఇక సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.  


ప్రస్తుతం యువ దర్శకులంతా తమ సత్తా చాటేందుకు ఉత్సాహపడుతున్నారు. అందుకే టాలెంట్ చూపించేలా హిట్ కొట్టి మరి స్టార్స్ అవకాశాలను అందుకుంటున్నారు. మరి రవితేజ కళ్యాణ్ కృష్ణ అసలు ఏమాత్రం ఊహించని ఈ కాంబినేషన్ వెండితెర మీద ఎలాంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: