సినిమా ఇండస్ట్రీ అన్న తరవాత హీరోల కీ హీరోయిన్ లకీ వేధింపులు సహజమైన విషయమే. ఎంతో మంది డైరెక్టర్ లతో నిర్మాతల తో ' కాంప్రమైజ్ ' అవ్వకుండా ఏ హీరో కానీ హీరోయిన్ కానీ ఒక స్థాయిని అందుకోలేరు అనేది అందరూ అనే మాట. అయితే ఇది హాలీవుడ్ లాంటి చోట కూడా జరుగుతూ ఉండడం ఆ నెంబర్ కొంతమంది విషయం లో చాలా ఎక్కువగా ఉండడం ఆశ్చర్యంగా ఉంది.

నిర్మాత హార్వే వీన్ స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పటికే అక్కడ కలకలం రేపుతూ ఉండగా ఇంకా అది సర్డుకోక ముందరే మరొక కొత్త పర్వం మొదలైంది. బగ్సీ చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగం లో ఆస్కార్ అవార్డ్ కూడా గెలుచుకున్న జేమ్స్ టోబాక్ మీద ఈ కొత్త ఆరోపణలు మొదలు అయ్యాయి.

జేమ్స్ తమ మీద లైంగికంగా వేధింపులు జరిపాడు అనీ బలవంతంగా తమని అనుభవించాడు అని ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై ఎనిమిది మంది మహిళలు ఆరోపించారు. లాస్ ఏంజెల్స్ టైమ్స్ సంస్థ కి ఈ విషయాలు లీక్ చేసారు వారంతా. ఇదివరకు ఇతనిమీద ఒక్కట్టంటే ఒక్క కేసు కూడా పెట్టని వీరందరూ అతని మీద ఈ రకమైన కేసులు పెట్టారు.

పనిలోకి తీసుకున్న మహిళలు, పనికోసం వెతుకుతున్న స్త్రీలు, వీధుల్లో తారసపడ్డ మహిళలపై టొబాక్‌ లైంగిక వేధింపులకు దిగేవాడని వార్తా సంస్థ తెలిపింది. వీరిలో కొందరికి స్టార్ హోదా వచ్చేలా చేస్తానని కూడా వాగ్దానం చేసినట్టు వారు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: