అక్కినేని నటవారసుడు అఖిల్ ‘హలో ’ అంటూ తన రెండో సినిమాతో పలకరించేదుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ప్రజంట్ పోస్ట్ పోడక్షన్ వర్క్ క్లైమాక్స్ కి రావడంతో థియేటర్స్ లో దిగేందుకు రెడీ అయ్యాడు. మరి క్రిస్మస్ గిప్ట్ గా వస్తున్న ఈ సినిమా అఖిల్ కెరియర్ కి బూస్ట్ ఇస్తుందా? మనంతో నాగ్ ఫ్యామిలీకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా..?

 Image result for akkineni akhil

టాలీవుడ్ లో ఫస్ట్ మూవీతోనే భారీ హైప్ క్రియేట్ చేసి.. చేతులు కాల్చుకున్న హీరో అక్కినేని అఖిల్. వినాయక్ డైరెక్షన్ లో మాస్ మసాలా నూరబోతే సీన్ రివర్స్ అయింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని హలో అంటూ పలకరించబోతున్నాడు. కొత్త కథతో సరికొత్త వ్యధ వినిపించబోతున్నట్టు సమాచారం..

 Image result for akkineni akhil

హలో సినిమాను అక్కినేని కాంపౌండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో,  సెకండ్ మూవీతోనైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్. అందుకే బడ్జెట్ విషయంలో వెనకాడకుండా సినిమాను నిర్మిస్తున్నాడు నాగ్. ఇక ఈ సినిమాలో ఆఖిల్ తో సిల్వర్ స్ర్కీన్ షేర్ చేసుకోబోతోంది కల్యాణి.

 Image result for akkineni akhil

అఖిల్ ఫస్ట్ మూవీ వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కగా ... సెకండ్ మూవీ హలోని విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మనం వంటి బ్లాక్ బస్టార్ ని నాగ్ ఫ్యామిలీకి ఈ డైరెక్టర్ అందిచడంతో అఖిల్ రెండో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అవ్వడం... కథకి తగ్గ క్యారెక్టర్ లో అఖిల్ అన్ని విధాలా కష్టపడటంతో ఈ సినిమా హిట్ మెట్టెక్కే ఛాన్స్ కనిపిస్తోందని ఫిల్మ్ నగర్ టాక్.

 Image result for akkineni akhil

ఎలా చూసినా అఖిల్ కి ఫస్ట్ మూవీ పంచ్ ఇవ్వడంతో రెండో పరీక్షకి అలెర్ట్ అయ్యాడు. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండిగ్ వరకు అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో నెక్ట్ మంథ్ టీజర్ తో పాటు ట్రైలర్ ని లాంచ్ చేయలనే ప్లాన్ లో ఉందట ఆ టీం. అలా డిసెంబర్ 22న క్రిస్మస్ గిప్ట్ గా  హలో అంటూ థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబొతోన్నాడు అఖిల్. ఇప్పటికే డిసెంబర్ నెల నాగార్జునకి బాగా కలిసిరావడంతో అదే లాజిక్ అఖిల్ మూవీకి వర్కవుట్ అవుతుందేమోనని అక్కినేని ఫ్యామిలీ గెస్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: