తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చారు.  ఇక అక్కినేని నాగార్జున తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  చైతూ ‘జోష్ ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది..మనోడికి తన కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయవంతమైన చిత్రం ఏదీ లేదు. ఇక వివివినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘అఖిల్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అఖిల్ నటనకు, డ్యాన్స్, ఫైట్స్ కి మంచి మార్కులు పడ్డాయి కానీ..సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 

Image result for akkineni nagarjuna akkineni family

దీంతో కాస్త లేట్ అయినా..లేటెస్ట్ గా రావాలని చూస్తున్నాడు ఈ యంగ్ హీరో.  తండ్రి సెంటిమెంట్‌ కొడుక్కు కలిసొస్తుందా? 'కలిసిరావడం' అంటే విజయం సాధించడమని, మంచి జరగడమని అర్థం. కొందరు తమకు ఫలాన నెల కలిసొచ్చిందని, ఫలాన వారమో, ఊరో, ఉద్యోగమో కలిసొచ్చిందని చెబుతుంటారు. అదో సెంటిమెంట్‌. సినిమా రంగంలో ఇలాంటివి చాలా ఉంటాయి. అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ అక్కినేని ఇప్పుడు తండ్రి సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా అని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గం.

Image result for akkineni nagarjuna akkineni family

అఖిల్‌ మొదటి సినిమా 'అఖిల్‌' పెద్ద డిజాస్టర్‌. దాన్నుంచి వెంటనే కోలుకోలేకపోయాడు. 2015 నవంబరులో ఆ సినిమా విడుదలైంది. రెండేళ్ల తరువాత అతని రెండో సినిమా 'హలో' విడుదల కాబోతోంది. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా 'మనం' దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదలవుతుందని చెబుతున్నారు. డిసెంబరు నాగార్జునకు లక్కీ మంత్‌. ఆ నెలలో విడులైన ఆయన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి.

Image result for hero akhil hello

కాబట్టి ఆ సెంటిమెంట్‌తో అఖిల్‌ సినిమా కూడా డిసెంబరులో విడుదల చేస్తున్నారట. తండ్రి సెంటిమెంట్‌ కుమారుడికి కలిసొస్తుందని అనుకుంటున్నారు. మొదటి సినిమా నవంబరులో విడుదలైంది. అది అచ్చిరాలేదనే ఫీలింగ్‌ ఉందేమో...! 'హలో' సినిమా డిసెంబరులో విడుదలై విజయం సాధిస్తే అఖిల్‌ కెరీర్‌ ఊపందుకునే అవకాశం ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: