ఈ మద్య వరుసగా సినిమా ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ప్రముఖ సినీ దర్శకుడు ఐ.వి. శశి ఈరోజు ఉదయం చెన్నైలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఐ.వి. శశి పూర్తి పేరు ఇరుప్పంవేడు శశిధరన్. ఆయన 28 మార్చి 1948లో జన్మించాడు. మలయాళ చిత్రసీమలో ఆయన తన చిత్రాలతో చెరగని ముద్ర వేశారు. ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శశి ఏడేళ్ల తరువాత దర్శకుడిగా మారాడు. 
Image result for i v sasi dead
శశి, సీమ దంపతులకు అను, అనీ ఇద్దరు పిల్లలు. ఆయన అనేక భారతీయ భాషల్లో మరియు 150 భాషల్లో చలన చిత్రాల్లో నటించారు. 2015 లో ఆయన J. C. డానియెల్ అవార్డు, మలయాళం సినిమాలో అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఐ.వి. శశి 34 సంవత్సరాల కాలంలో 170 కన్నా ఎక్కువ చిత్రాలను దర్శకత్వం వహించి చలన చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. శశి మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.   
Image result for i v sasi dead
మమ్ముట్టి, మోహన్ లాల్, సుకుమారన్, విన్ సెంట్, సీమ తదితరులకు చిత్రసీమలో మరిచిపోలేని చిత్రాలను అందించారు శశి. పలువురు ప్రముఖులు ఐ.వి.శశి మృతికి సంతాపం తెలిపారు. శశి దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఉల్సవం’. ‘అనుభవం’, ‘1921’, ‘ఈట’, ‘మరిగయ’ తదితర చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ‘అవలుడే రావుక్కల్’ సినిమా సెట్ లో నటి సీమను శశి పెళ్లి చేసుకున్నారు.1982లో శశికి జాతీయ అవార్డు లభించింది. 2015లో జేసీ డేనియల్ అవార్డుతో శశిని కేరళ ప్రభుత్వం సత్కరించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: