శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో ర‌జ‌నీకాంత్‌, అమీ జాక్స‌న్‌, అక్ష‌య్ కుమార్‌లు న‌టించిన `రోబో 2.0` చిత్ర ఆడియో వేడుక రేపు దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.  గత కొన్ని రోజుల నుంచి ఈ చిత్రంపై విపరీతమైన హైక్ తీసుకు వస్తున్నారు.  గతంలో రోబో చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే దాన్ని మించిన చిత్రంగా రోబో 2.0 ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతుంది.

అంతే కాదు భారత దేశంలో ఇప్పటి వరకు భారీ బడ్జెట్ చిత్రం సుమారు 450 కోట్లు ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని తీశారట. ఈ సినిమా ఆడియో వేడుకను శుక్రవారం(అక్టోబర్-27)న దుబాయ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతుండగా సినిమా యూనిట్ కూడా దుబాయ్ చేరుకుంది. 

ఈ ప్రతిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మంలో తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమానికి రానా ద‌గ్గుబాటి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే త‌మిళ భాష ఆడియో కార్యక్రమానికి `స్పైడ‌ర్‌` సినిమాలో న‌టించిన ఆర్జే బాలాజీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర ఆడియో వేడుక‌కు సంబంధించి దుబాయ్‌లో ప్రెస్‌మీట్ కూడా నిర్వ‌హించారు.   

ఇక ఆడియో వేడుక సంబంధించిన ఆసక్తికర విషయాన్ని యంగ్ హీరో రానా తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశాడు. ‘భారతీయ సినిమా చరిత్రలో భారీ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు దుబాయ్ లో ఉన్నాను’ అంటూ కామెంట్ చేశాడు రానా.

బూర్జ్ పార్క్ లో జరుతున్న ఈ వేడుకకు దుబాయ్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం ఉంది. రోబో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: