టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే నో అనే హీరో, హీరోయిన్.... ఇప్పుడు యమా ఇంట్రస్ట్ చూపించేస్తున్నారు. సినిమాను సక్సెస్ చేసేందుకు తమ వంతుగా ప్రచార బాధ్యతలు చేపడుతున్నారు. మొన్నటి వరకు బాలీవుడ్ కే పరిమితమైన ఈ ట్రిక్ ఇప్పుడు టాలివుడ్ బ్యూటీస్ ను కూడా ఎట్రాక్ట్ చేసేసింది. నాలుగురాళ్లు వెనకేసుకోడానికి యాడ్ అయితేనేం.. ప్రమోషన్ అయితేనేం అనుకుంటున్నారు నేటి హీరోయిన్స్..

Related image

అందివచ్చిన ప్రతి అవకాశాన్ని టక్కున పట్టేసుకుంటున్నారు టాలివుడ్ బ్యూటీస్. చిన్న రోల్ నుంచి ఐటం సాంగ్ వరకు ఏది చేసినా..ఆ సినిమా ప్రమోషన్ కు మేము సైతం అంటూ బయటకొస్తున్నారు. రిసెంట్ గా జరిగిన గరుడవేగ  ప్రీరిలీజ్ ఫంక్షన్ చూస్తే .. అబ్బో… అసలు ఈ సినిమాలో హీరో రాజశేఖరా లేదంటే సన్నీ లియోని నా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మడు ఆ రేంజులో అక్కడ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిపోయింది. నిజానికి ఈ సినిమాలో తను చేసింది ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే . కాని ప్రమోష న్ లో మాత్రం తనే మైయిన్ రోల్ అనేంత గా సందడి చేసింది..

Image result for SEERAT KAPOOR RAJU GARI GADI

కాజల్ అగర్వాల్ విషయనికి వస్తే మెర్సాల్ సినిమాలో తాను చేసింది ప్రాముఖ్యం లేని ఒక చిన్న పాత్ర. ఓ రెండు పాటలు. కానీ ఆ సినిమా కోసం మాత్రం దాదాపు వారం రోజుల పాటు ప్రమోట్ చేసింది. మెర్సల్ సినిమా కోసం కాజల్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంది కాబట్టి ప్రమోషన్ చేసింది అనుకుందా.. మరి వాట్ ఎబోట్ సీరత్ కపూర్. రాజు గారి గది 2 సినిమాలో ఏదో అలా కనిపించి గ్లామర్ ఆరబోసే పాత్రను చేసింది. కానీ ప్రమోషన్ లో మాత్రం ఏ రేంజ్ ఎఫర్ట్ పెట్టింది. రిలీజ్ ముందు వరకు అన్ని ప్రెస్ మీట్లలో హడావిడి చేసి లీడ్ రోల్ లో నటించే బ్యూటీ తనే అనేంతగా ఫోకస్ అయ్యింది..

Image result for KAJAL AT MERCEL PROMOTION

సో క్యారెక్టర్ ఏదైనా.. ప్రామినెంట్ రోల్ చేసినా చేయకపోయినా.. సినిమాకు ప్లస్ అవుతుంది అనుకుంటే చాలు మన సిల్వర్ స్క్రీన్ ముద్దుగుమ్మలు.. ప్రమోషన్ కు సై అనేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: