బాలీవుడ్ లో హీరోయిన్లు ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెడతారని అందరికీ తెలుసు..దీనికి సంబంధించిన కొన్ని ఫిట్ నెస్ వీడియోలు సోషల్ మీడియాలో షేరు చేస్తూ తమ అందాల ప్రదర్శన చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఫిట్ నెస్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది..కాకపోతే ఈ సారి వెరైటీగా న‌టి ఆలియా భ‌ట్‌కి క‌త్రినా వ్యాయామ శిక్ష‌కురాలిగా అవ‌తార‌మెత్త‌డం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
Katrina Kaif and Alia Bhatt
సాదారణంగా కత్రినా, ఆలియాభట్ ఒకే శిక్షకురాలు  యాస్మిన్ క‌రాచీవాలా వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. ఆమె విధులకు హాజరు కాకపోవడంతో..ఆలియాతో క‌త్రినా స్క్వాట్స్ చేయించింది. ట్విస్ట్ ఏంటంటే.. ఈ వీడియో లో ఆలియాతో 300ల స్క్వాట్స్ చేయించేందుకు క‌త్రినా ప్రయత్నిస్తున్నట్లు.. 100 నుంచి 109 వ‌ర‌కు క‌త్రినా లెక్క‌పెట్ట‌డం చూడొచ్చు. 
Image result for Katrina Kaif Turned Gym Alia Bhatt
అయితే ఆలియా భట్ మాత్రం ఎంతో బరువు మోస్తున్నట్లు..తెగ ఆయాస పడుతూ  స్క్వాట్స్ చేస్తుంది. దీంతో  మ‌ధ్య మ‌ధ్య‌లో ఆలియాను ప్రోత్స‌హిస్తూ.. క‌త్రినా అటూ ఇటూ తిరుగుతూ..ఉండటం వీడియోలో గమనించ వచ్చు.  ఏది ఏమైనా ఇద్దరు ముద్దు గుమ్మల వీడియో సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: