తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తో ‘చంద్రముఖి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మళియాళ కుట్టి నయనతార తాజాగా  రాజస్థాన్ లోని అజ్మీర్ ద‌ర్గాను సంద‌ర్శించింది.  ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలకు పైగా అయ్యింది. కానీ ఇప్పటి వరకు గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికే టాప్ హీరోయిన్ లీస్ట్ లో ఉంది..అంతే కాదు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయన్ కావడం మరో విశేషం. 

ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ప్రేమ విషయంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న నయనతార ప్రస్తుతం ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం తమిళ, తెలులు ఇండస్ట్రీలో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నయన తార ఆ మద్య తన ప్రియుడితో విదేశాల్లో ఎంజాయ్ చేసి వచ్చింది. తాజాగా రాజస్థాన్ లోని అజ్మీర్ ద‌ర్గాను సంద‌ర్శించింది.
Image result for nayanatara
నయనతార నటిస్తోన్న కొత్త సినిమా ‘వెలైకరన్’ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతున్నది. షూటింగ్ బ్రేక్ టైంలో ఆ ప్రాంతంలో ఉన్న అజ్మీర్ షరీఫ్ దర్గాను నయన్ చిత్రయూనిట్ తో కలిసి దర్శించుకుంది. ఈ సందర్భంగా దర్గాలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: