తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో నటించిన అమలాపాల్ తర్వాత ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లిచేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం పెద్ద సెన్సేషన్ అయ్యింది. ప్రేమించి తరువాత పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న అమలాపాల్, ఏఎల్ విజయ్ చట్టపరంగా విడాకులు తీసుకున్నారు.  ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ తెరపై కనించబోతుంది.
Image result for అమలాపాల్ విడాకులు
తాజాగా అమలాపాల్ కి కారు కష్టాలు వచ్చాయి.  విలాసవంతమైన కారు కొనుగోలు వ్యవహారంపై పుదుచ్చేరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది అమలాపాల్ పుదుచ్చేరిలో రూ.1.12 కోట్లు వెచ్చించి విలాసవంతమైన కారు కొన్నారు.  కారును తన సొంత రాష్ట్రమైన కేరళలో కాకుండా తప్పుడు చిరునామాతో పుదుచ్చేరి ఆర్టీవో కార్యాలయంలో ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
Image result for అమలాపాల్ విడాకులు
20లక్షల రూపాయల పన్ను మాఫీ కోసమే పుదుచ్చేరిలో అమలాపాల్ కారు కొని తక్కువ పన్నుతో రిజిస్ట్రేషన్ చేయించారని సమాచారం.  ఈ వ్యవహారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విచారణకు ఆదేశించారు.  అమలాపాల్‌, నటుడు భగత్ పాసిల్ సహా పలువురు నటులు ఇటువంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు.

తప్పుడు చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించి తక్కువ పన్నులు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు.   తప్పుడు చిరునామాతో రిజిస్ట్రేషన్ అమలాపాల్ పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ పోలీసులను ఆదేశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: