ఒకరు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మరొకరు మాజీ ప్రపంచ సుందరి - లీడింగ్ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ .. అయితే వీరిద్దరూ వరసకి ఏమవుతారో మనకి తెలుసు.

మామ కోడళ్ళు గా ఫేమస్ అయిన వీరిద్దరూ ఒకరికి ఒకరు అప్పు తీసుకున్నారు అంటే మనం నమ్మగలమా ? కానీ నిజం అదే. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తన కోడలు ఐశ్వర్యారాయ్ నుంచి రూ. 21.4 కోట్ల అప్పు తీసుకున్నారట. అంతేనా, కుమారుడు అభిషేక్ నుంచి ఏకంగా రూ. 50 కోట్లు అప్పు తీసుకున్నాడట.

ఈ విషయాన్ని ఆయన భార్య, పార్లమెంట్ సభ్యురాలు జయాబచ్చన్, తన అఫిడవిట్ లో ప్రాపర్టీ డిటెయిల్స్ లో తెలియజేశారు. భర్త ఆస్తి పాస్తుల వివరాలు అందించిన ఆమె అమితాబ్ బచ్చన్ ఇంకా నూట నాలుగు కోట్ల అప్పు చెల్లించాల్సి ఉంది అనీ తన ఆస్తుల వివరాలు నలభై ఎనిమిది కోట్లు అనీ తెలిపారు.

ఏడు పదుల వయసులోనూ బిజీగా ఉంటూ, రెండు చేతులా సంపాదిస్తూ, కోట్లకు పడగలెత్తిన అమితాబ్, కొడుకు, కోడలి నుంచి అప్పులు తీసుకోవడం ఏంటో మరి! ఇన్కమ్ టాక్స్ నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా చెబుతున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: