జాగో బద్లో బోలో అనే కార్యక్రమం లో పాల్గొన్న సింగర్ సునీత ఇక్కడ వచ్చిన యువతులని చైతన్య పరిచే పనిలో పడ్డారు. లైంగిక వేధింపుల గురించీ అమ్మాయిలు సమాజంలో ఎదురుకొంటున్న ఇబ్బందుల గురించీ ఈ వేదిక మాట్లాడుతుంది. 

లైంగిక వేధింపులపై మాట్లాడేందుకు సిగ్గు, బిడియం, పరువు ప్రతిష్ఠలు ఆటంకాలని చెప్పింది. దీని వల్ల వేధింపులకు గురవుతున్న చిన్నారులు దానిపై బయటకు చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆమె పేర్కొంది.

ఇకపై అలా జరగకూడదని చెప్పింది. ప్రతి ఆడపిల్ల తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టాలని సూచించింది. లైంగిక వేధింపులు, దాడులు, హింసకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ గళం విప్పాలని కోరింది.

అనంతరం హిందీ పాట ఒకటి పాడి వినిపించింది.  సునీత రాక తో మాటలతో యువతుల లో చైతన్యం  ఉపొంగింది, అనేక మంది తాము ఎదురుకొన్న అనుభవాలని బయటకి చెప్పే ప్రయత్నం చేసారు. పేర్లు చెప్పకపోయినా సందర్భాలు, వారు ఎలా సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది అనేవి ఓపెన్ గా చెప్పారు అమ్మాయిలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: