ఆ మధ్య యాక్సిడెంట్ చేసి రోడ్డు మీద రచ్చ చేసారు హీరో రాజశేఖర్ .. పెద్ద వివాదం లో ఇరుక్కున్న ఆయన రోడ్డు మీద మరొక కారుని గుద్దేసి సంబంధం లేకుండా మాట్లాడడం చూసాం. అయితే ఆయన తన తల్లి చనిపోయన బాధలో ఉన్నారు అనీ అందుకే అలా ప్రవర్తిస్తున్నారు అనీ జీవిత సర్ది చెప్పిన విషయం విదితమే.


ఆ తరవాత గరుడ వేగ సినిమా విడుదల అవ్వడం అందరూ హిట్ టాక్ ఇవ్వడం తో ఆ ఫామిలీ హ్యాపీగా ఉంది. కానీ వివాదాలు మాత్రం ఈ కుటుంబాన్ని అప్పుడే వదిలేలా కనపడ్డం లేదు. తాజాగా ఆయన పెద్ద కూతురు శివాని ఆగి ఉన్న ఒక కారు ని గుద్దేసింది. జూబ్లీ హిల్స్ లో ఆమె నడుపుతున్న కారు అదుపు తప్పి ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. అయితే ప్రమాదం చిన్నది కావడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.



అయితే, బాధితుడు మాత్రం తనకు రూ. 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తాను కారు కొని రెండు వారాలైనా గడవలేదని, కాబట్టి తనకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ అతను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసు ఇంకా నమోదు చెయ్యలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: