తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..గోవా బ్యూటీ ఇలియానా.  తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్మడు టాప్ హీరోయిన్ లీస్టు లోకి చేరిపోయింది.  తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ సాధించలేక పోయింది.  తాజాగా  ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమంకి హాజరైన ఈ భామ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి వ్యాఖ్యానించింది. 
Image result for ileana hot
ఇండస్ట్రీలోయి వచ్చిన కొత్తలో తన శరీరం గురించి పలువురు పలు రకాల కామెంట్స్ చేసినప్పుడు తాను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఒకానొక టైంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించిందట.  కానీ, తనకు తానే ధైర్యం చెప్పుకొని భవిష్యత్ లో ఎంతో సాధించాలని  నార్మల్ స్టేజ్ కి వచ్చానని చెబుతోంది ఈ గోవా బ్యూటీ. 
Image result for ileana hot
ఇండస్టీలోనే కాదు సొసైటీలో చాలా మంది కొన్ని సార్లు మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారని..కానీ అలాంటి వారు ఒక్కసారి తమకు తామే ధైర్యం చెప్పుకొని బంగారు భవిష్యత్ కి దారి వేసుకోవాలని.. డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు వెంటనే వైద్యులని సంప్రదించాలి లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటూ  లెక్చర్ ఇస్తుంది ఇలియానా.   
Image result for ileana hot
ఇండస్ట్రీలో నటీమణులు అందంగా కనిపించడానికి రెండు గంటల సమయం పడుతుంది, కాని మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మేకప్ లు లేకుండా చాలా గ్లామర్ గా కనిపిస్తారని వివరించింది. ఇలియానా వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమంలో ఉమెన్ ఆఫ్ సబ్ స్టెన్స్ అనే అవార్డు అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: