తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది దర్శకులు తక్కువ కాలంలో గొప్ప పేరు సంపాదించారు.  అలాంటి దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  శ్రీనివాస్  ఒకరు.  అంతే కాదు తెలుగు ఇండస్ట్రీలో అందరితో స్నేహభావంతో ఉండే త్రివిక్రమ్ మెగా హీరో పవన్ కళ్యాన్ కి ఎంతో ఆప్తమిత్రుడు..ఎంతగా అంటే తాను మొదలు పెట్టే ఏ పనైనా త్రివిక్రమ్ తో మాట్లాడి క్లారిటీ తీసుకున్న తర్వాతే మొదలు పెడతాడని ఫిల్మ్ వర్గాల టాక్.  అంతే కాదు వీరిద్దరి స్నేహబంధం గురించి అందరూ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ - పవన్ లాంటి స్నేహితులు ఉండాలని అంటారు. 
Image result for త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు
తెలుగు సినిమా రచయితల విలువ‌ను మార్చేసిన మాంత్రికుడు.. తొలి సినిమాతోనే త‌న ఖ‌లేజా చూపించిన ద‌ర్శ‌కుడు. జ‌ల్సాతో త‌న‌లో ఉన్న జులాయిని చూపించి.. సన్ ఆఫ్ సత్యమూర్తి గా విలువ‌ల‌ను చూపించిన వ్య‌క్తి. అత్తారింటికి దారేది అని మ‌ర్యాద‌ను నేర్పిన మంచివాడు. అ ఆ అంటూ అంద‌మైన అద్భుతాన్ని చూపించిన అంద‌రివాడు. ఆయన మాటల్లో ప్రేమ ఉంటుంది. ఆయన మాటల్లో బాధ ఉంటుంది.
Image result for త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు
ఆయన మాటల్లో లోతైన అర్థం ఉంటుంది. ఆయన మాటల్లోనే అన్ని భావోద్వేగాలు వ్యక్తం అవుతాయి. మాటలతోనే ఎవరికైనా పంచ్ వేయగలడు, మాటల తోనే ఎవరినైనా మార్చివేయగలడు, మాటలతోనే మాయ చేయగలడు. అందుకే ఆయనను మాటల మాంత్రికుడు అంటారు.మ‌వ‌రం లో పుట్టి.. వైజాగెళ్లి ఆంధ్రా యూని వర్సిటీలో ఎమ్మెస్సీ చదివిన యువ కుడు హైదరాబాదొచ్చి సినీ పరిశ్రమలో చేర‌డానికి నానాకష్టాలూ పడి ట్యూషన్లు చెప్పి కాలం వెల్లదీశాడు.
Image result for pawan trivikram
ఆ తర్వాత అసిస్టెంట్ రైటర్‌గా పోసాని గారి దగ్గర పనిచేసి, స్వయంవరంతో కొంత పేరు సంపాదించాడు.  దర్శకత్వంలో సూపర్‌హిట్టయ్యాక, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి వరకూ అప్రతిహతంగా హిట్లిచ్చి  రచయితగా ఎదిగాడు.  నేడు (నవంబర్ 7) పుట్టిన రోజు జరుపుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఏపీహెరాల్డ్.కామ్ శుభాకాంక్షలు తెలుపుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: