సాంకేతికత అనేది అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశ్యం తో సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు చెయ్యచ్చు అని చాలా మంది నిరూపిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రతీ పనికీ ఒక యాప్ వచ్చేసింది. ఇంట్లో ఉన్న గీజర్ కట్టడానికి కూడా యాప్ ని వాడుతున్న మనం అమ్మా నాన్నలతో వీడియో కాల్స్ కూడా చేస్తూ ఉంటాం.

టెక్నాలజీ ని మంచి కీ చెడు కీ రెండిటికీ వాడుకోవచ్చు. ఇప్పుడు తమిళ హీరో దీన్ని సంఘ సేవ కి వాడాలి అని అనుకుంటున్నాడు. విశాల్ అంటూ ఒక కొత్త యాప్ ని స్టార్ట్ చేసి దీని ద్వారా ఎవరికైనా సహాయం చెయ్యాలి అని అతను ప్లాన్ చేసాడు. ఈ యాప్ ఆవిష్క‌ర‌ణ‌లో భాగంగా విశాల్ ఒక వీడియో విడుద‌ల చేశాడు. 'నిత్య‌జీవితంలో టెక్నాల‌జీ ఒక భాగమైపోయింది.

కిరాణ స‌రుకుల నుంచి ఫ‌ర్నీచ‌ర్ వ‌ర‌కు అన్నీ ఒక్క క్లిక్‌తో ఇంటి ముందుకి వ‌చ్చేస్తున్నాయి. అదే విధానాన్ని సామాజిక సమ‌స్య‌ల కోసం ఉప‌యోగిస్తే ల‌క్ష‌ల మందికి మేలు జ‌రుగుతుంది' అని వీడియోలో అన్నాడు. అన్ని యాప్ ల లాగానే ఇది సేవ చేసే విషయం లో ఫుల్ పాజిటివ్ గా ఉంటుంది అనీ స్పెషల్ బృందం మీకు వెనుక ఉంది హెల్ప్ చేస్తుంది అంటున్నాడు విశాల్.

'స‌హాయం చేయాల‌నుకునే వారికి విశాల్ బృందం వెన్నుద‌న్నుగా ఉంటుంది. అన్ని వెరిఫికేష‌న్లు పూర్త‌యిన త‌ర్వాత దాత‌లు ఇచ్చిన వాటిని నిజంగా అవ‌స‌రంలో ఉన్న వారికి అంద‌జేస్తుంది. అంద‌జేసిన తర్వాత క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్‌తో పాటు కృత‌జ్ఞ‌త‌ల స‌ర్టిఫికెట్ కూడా పంపిస్తారు' అని విశాల్‌ తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: