దాదాపు పదేళ్ళ గ్యాప్ తరవాత హీరో రాజశేఖర్ గరుడ వేగ అనే సినిమాతో వచ్చి తనని తాను నిరూపించుకున్నారు. ప్రేక్షకుల కి సరైన కంటెంట్ ఉన్న సినిమా ఉంటె చాలు స్టార్ డం అనేది ఇంపార్టెంట్ కాదు అని ప్రూవ్ చేస్తోంది గరుడ వేగ చిత్రం.

ఈ సినిమా ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచీ ఈ సినిమా మీద విపరీతమైన హైప్ ఉంది అనే చెప్పాలి. ప్రేక్షకుల అంచనాలని అమాంతం ట్రైలర్ తో పెంచేసాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.

అంతే విధంగా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం లో కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు మనోడు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా కలక్షన్ లు దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షలకి చేరుకున్నాయి. ఈ కలక్షన్ అంతా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 3.25 కోట్ల షేర్ ను .. 6.65 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 'గరుడ వేగ'కి ముందు వచ్చిన సినిమాలు .. తరువాత వచ్చిన సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోవడం, ఈ సినిమాకి బాగా కలిసొచ్చిందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: