తెలుగు ఇండస్ట్రీలో తేజ దర్శకత్వంలో ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అతి తక్కువ కాలంలో స్టార్ హీరోల సరసన నటించిన విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి సుమారు పది సంవత్సరాలు దాటుతున్నా గ్లామర్ ఏ మాత్రం తగ్గకుండా మెయిన్ టేన్ చేస్తుంది.   తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న కాజల్ ఓ హిందీ సినిమాలో కూడా నటించింది. 
Image result for kajal khaidi no 150
ఆ మద్య కాజల్ టైమ్ అయిపోయిందని..ఈ అమ్మడికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సినిమాలు కరువయ్యాయని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్, మహేష్ బాబు, మెగా స్టార్ చిరంజీవి సరసన నటించి ఒక్కసారే ఫామ్ లోకి వచ్చింది.  చిరంజీవి సరసన ఆమె చేసిన 'ఖైదీ నెంబర్ 150' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత రానాతో ఆమె చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' ఘన విజయాన్ని అందుకుంది.
Related image
ఇక విజయ్ జోడీగా తమిళంలో చేసిన 'మెర్సల్' ఒక రేంజ్ హిట్ ను ఆమె ఖాతాలో జమ చేసింది.  ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో దర్శక, నిర్మాతలు కాజల్ కోసం క్యూ కడుతున్నారు. తమ సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి దర్శక నిర్మాతలు .. హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. అయితే సీనియర్ హీరోలతో చేయాలంటే కాజల్ ఎక్కువ పారితోషికం అడుగుతోందట.
Image result for vijay mersal kajal
ఇక సీనియర్ హీరోలతో చేస్తే .. యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయి గనుక, ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సిందే అంటోందట.  ఇక తేజ దర్శకత్వంలో వెంకటేశ్ తో చేస్తోన్న సినిమాకి కూడా పెద్ద మొత్తమే తీసుకుంటోందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: