ఆన్ లైన్ లో , సోషల్ మీడియా లో హీరో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. త్వరలో పవన్ నుంచి రాబోతున్న అజ్ఞాతవాసి సినిమా కి సంబంధించి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ జరుగుతోంది.ఇంకా టైటిల్ పెట్టకముందే ఫాన్స్ అజ్ఞాతవాసి అని పిలుచుకుంటూ ఉన్న ఈ సినిమా కి సంబందించిన ఒక పాట విడుదల అయ్యింది.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తెలుగులో లాంచ్ అవుతూ చేసిన మొట్ట మొదటి సాంగ్ ఇదే .. ఈ సాంగ్ అవుట్ పుట్ చాలా సూపర్బ్ గా వచ్చింది అని చెప్పాలి, బైటికొచ్చి చూస్తే అంటూ సాగిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో సెన్సేషన్ అయిపోయింది.

లిరికల్ వీడియో గా నిన్న ఉదయం త్రివిక్రమ్ బర్త్ డే గిఫ్ట్ గా విడుదల చేసింది చిత్ర బృందం.లిరికల్ వీడియో రూప కల్పన కూడా చాలా కొత్తగా అనిపించింది. కేవలం మొదటి ఎనిమిది గంటల్లోనే ఈ సినిమా పాట 1 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది.

ప్రస్తుతం 1.5 మిలియన్ వ్యూస్ దాటి నడుస్తోంది. శ్రీమణి సాహిత్యం .. అనిరుధ్ సంగీతంతో ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ పాటకి ఇంతవరకూ లక్షకి పైగానే లైక్స్ రావడమే అందుకు నిదర్శనం. మొత్తానికి మొదటి పాటతోనే 'అజ్ఞాతవాసి' అంచనాలు పెంచేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: