సినిమాలలో ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండే కీర్తి సురేష్ నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలనే ఎంచుకుంటుంది. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు అన్నీ  ఈ విషయాలనే  ప్రూవ్ చేసాయి. అయితే ఆమె ఇప్పటివరకు ఏసినిమాలోను చూపెట్టని  ఇన్నోసెంట్ కామెడీ యాంగిల్ ను బయటకు తీస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సంక్రాంతికి రాబోతున్న అజ్ఞాతవాసి సినిమాలో ప్రతిచిన్న విషయానికి 'నాన్నా' అంటూ పలకరించే పాత్రను హీరోయిన్ కీర్తి సురేష్ చేతచేయిస్తున్నాడట మనమాటల మాంత్రీకుడు.

తనతండ్రిని అడిగే విషయమా ? అడగకూడని విషయమా ? అన్నది కూడా పట్టించుకోకుండా 'నాన్నా ఏంచేయమంటారు' అని అడిగే క్యారెక్టర్ లో కీర్తి అమాయకతతో చేసిన నటన విపరీతమైన నవ్వును తెప్పిస్తుంది అని టాక్. కీర్తిసురేష్ పాత్ర మాత్రమేకాదు మురళీశర్మ రావురమేష్ ల పాత్రల డైలాగులు కూడ తెగనవ్వు తెప్పిస్తాయి అని అంటున్నారు. సినిమా అంతా హాస్యంతో కూడి ఉన్న కథ మాత్రం పాతసినిమా కధను మళ్ళీ చూస్తున్నట్లు అనిపిస్తుందని  ఈసినిమా కథగురించి గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

ప్రస్తుతం ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం  ‘మీనా’ సినిమాను ‘అ ఆ’ గా మార్చినట్లుగా 1980వ ప్రాంతంలో విడుదలైన రాఘవేంద్రరావు మార్క్  సినిమాను ‘అజ్ఞాతవాసి’ గా మారుస్తున్నట్లు తెలుస్తోంది. జయసుధ వెనుక ఉండి వెంకీ ద్వారా పగతీర్చుకున్న పాతసినిమా మాదిరిగా ‘అజ్ఞాతవాసి’ లో కూడ సవతి తల్లి వెనుకఉండి సవతి కొడుకు పవన్ ద్వారా పగతీర్చుకునే కధ అన్నప్రచారం జరుగుతోంది. ఒకనాటి  విలన్ డెన్ హీరోయిన్లను ఎత్తుకుపోవడం హీరో వెళ్లి కాపాడటం వంటి పాతసినిమాల సీన్స్ ‘అజ్ఞాతవాసి’ లో కూడ ఉంటాయని అంటున్నారు.

 అయితే ఇలాంటి పాతకధకు  త్రివిక్రమ్ తన స్టైల్  స్క్రీన్ ప్లే  అందించి తన  డైలాగులతో ఈసినిమాలోని  క్యారెక్టర్లను కొత్తగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. 150కోట్ల బిజినెస్ టార్గెట్ గా విడుదల కాబోతున్న ఈమూవీలో కీర్తిలో అమాయకతతో కూడిన కామెడీ యాంగిల్ చూపెడుతూ  మరో హీరోయిన్ గా నటిస్తున్న అను ఇమ్మానుయేల్ చేత  యూత్ ను ఆకర్షించడానికి  కొంతవరకు ఎక్స్ పోజింగ్ చేయిస్తున్నట్లు టాక్. మొన్నటివరకు చిన్నసినిమాల్లో కనిపించిన అను రీసెంట్ గా త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్బంగా అను ఇమ్మానుయేల్ ఈసినిమాకు సంబంధించిన ఒకఫొటోను సోషల్ మీడియాలో పోస్టుచేసింది. ఈఫొటోలో ఈబ్యూటీ చాలహాట్ గా కనిపించడంతో త్రివిక్రమ్ చాలతెలివిగా అటు కీర్తిని ఇటు అను ఇమ్మానుయేల్ ను పవన్ ‘అజ్ఞాతవాసి’ కోసం త్రివిక్రమ్ ప్రయోగిస్తున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: