డబల్ హ్యాట్రిక్ విజయాలతో ముందుకు దూసుకుపోతున్న హీరో నాని స్ట్రాటజీలు టాప్ యంగ్ హీరోలకు కూడ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీనికితోడు సినిమాల కథలను ఎంచుకునే విధానంలో నాని అనుసరిస్తున్న వ్యూహాలవల్ల ప్రస్తుతం నాని టాప్ యంగ్ హీరోల రేస్ లో దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో నాని క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఎమ్ సీ ఎ’ సినిమాకు సంబంధించి ఒక చిన్న లీక్ బయటకు వచ్చింది.

మిడిల్ క్లాస్ అబ్బాయి అనే ఇన్న‌ర్ మీనింగ్‌ తో నిర్మింపబడుతున్న  ఈ సినిమా క‌థ ఒక ఫ్యామిలీ డ్రామ అని తెలుస్తోంది. మరింత వివరంగా చెప్పాలి అంటే ఈసినిమా కథ వదినా మరిదిల చుట్టూ తిరిగే కథ అని అంటున్నారు.  ఈమూవీలో మరిదిగా నాని నటిస్తూ ఉంటే వదిన పాత్రలో ఒకనాటి గ్లామర్ హీరోయిన్ భూమిక నటిస్తోంది. వ‌దిన పాత్రలో నటిస్తున్న భూమిక ఆర్టీవో అధికారిగా కనిపిస్తుంది. నాని మాత్రం ఎప్పుడూ ఫ్రెండ్స్ తో జతకట్టి తిరిగే గ్యాంగ్ బ్యాచ్ తో కనిపిస్తాడు. 

వ‌దిన‌కూ మ‌రిదికీ ఒక్క క్ష‌ణం కూడా ఈసినిమా కథలో పడదట. మ‌రిదిని ఎప్పుడూ చిన్న చూపు చూస్తూ కనిపించే భూమిక అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కోవడంతో దాని నుంచి గట్టెక్కించే హీరోగా నాని కనిపిస్తాడని టాక్. ఒక్కమాటలో చెప్పాలి అంటే చిరంజీవిని మెగా స్టార్ గా మార్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కథను పోలి నాని లేటెస్ట్ సినిమా ఉంటుందని అంటున్నారు. నాని ఎన‌ర్జీ యాక్షన్ తో పాటు ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ అల్లిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి కొత్త ఫ్లేవ‌ర్ తీసుకొచ్చింద‌ని స‌మాచారం. 

కీర్తి సురేష్ నానీల‌ మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయేలా కుదిరింద‌ని తెలుస్తోంది. దీనికితోడు ప్రస్తుతం దిల్ రాజ్ అదృష్టం పరుగులు తీస్తున్న నేపధ్యంలో క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈసినిమా పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఏకంగా అఖిల్ భారీ బడ్జెట్ మూవీ ‘హలో’ తో పోటీ పడుతూ ఈసినిమా వస్తున్న నేపధ్యంలో నాని దూకుడుకు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్య పోతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: