ప్రేమ,పెళ్లి పేరిట ఓ మహిళను మోసం చేసిన వ్యవహారంలో నగరంలోని ప్రఖ్యాత ఐమ్యాక్స్ థియేటర్ మేనేజర్ వెంకట ప్రసాద్‌ ను ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. 

Image result for venkata prasad prasad's imax manager

బంజారా హిల్స్ రోడ్డు నెంబరు 10లో నివసముండే ఓ మహిళ (33) ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో గత కొంత కాలంగా పనిచేస్తోంది. పది సంవత్సరాల క్రితం వివాహం జరిగినప్పటికి మనస్పర్థల కారణంగా భర్తకు ఆమె దూరంగా ఉంటోంది. విడాకుల కేసు విచారణ కోసం కోర్టులో పెండింగ్ లో ఉండగా, ఐమ్యాక్స్ మేనేజర్ వెంకటప్రసాద్ కన్ను ఆమెపై పడింది. ఆమె తో మాటలు కలిపి అమె కు దగ్గరై,  ఆపై ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. 

Image result for venkata prasad prasad's imax manager

విడాకులు రాగానే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనం చేశాడు. ఏడేళ్ల సహజీవనంలో ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా రెండుసార్లు గర్భస్రావం చేయించాడు, వివాహం తరవాత పిల్లల్ని కందామని నమ్మిస్తూ. ఇంతలో ఆమెకు విడాకులు రాగా ముఖం చాటేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానికి స్పందించిన పోలీసులు వెంకట ప్రసాద్‌ ను అరష్టు చేశారు. 

Image result for venkata prasad prasad's imax manager

ఈ వెంకట ప్రసాద్‌ బహుబలి సినిమాలో శివుడు పాత్రకు - పెంపుడు తండ్రి పాత్ర - అంటే సంగ (నటి రోహిణి) పాత్రకు భర్త పాత్రలో నటించారు. తాజాగా రాజశేఖర్ ‘గరుడ వేగ’ సినిమాలో ముఖ్యమంత్రిగా ఒక చిన్న పాత్ర కూడా పోషించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: