పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం సర్వసాధారణం. అయితే ప్రభాస్ అనుష్కల మధ్య స్నేహానికి సంబంధించి ఎన్నో వార్తలు గాసిప్పులు ఇప్పటికే హడావిడి చేస్తున్న నేపధ్యంలో మూడురోజుల క్రితం అనుష్క పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ విషయానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్.

గతంలో ప్రభాస్ బర్త్‌డే కు అనుష్క బ్యూటిఫుల్ వాచ్‌ ను గిఫ్ట్‌గా ఇచ్చిన నేపధ్యంలో దానికి బదులుగా అనుష్కకు ప్రభాస్ ఒక ఖరీదైన  బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే అనుష్క పుట్టినరోజునాడు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ యూవీ క్రియేషన్స్ తమ ‘భాగమతి’ ఫస్ట్ లుక్ ను ఆమె పుట్టినరోజునాడు విడుదల చేసిన విషయం తెలిసిందే.

దీనికి బోనస్ గా అనుష్కను మరింత జోష్ లో పెట్టడానికి ప్రభాస్ ఇలాంటి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చి ఉంటాడు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలలోని వాస్తవాలు ఎన్నో ప్రస్తుతానికి బయటకు రాకపోయినా ప్రభాస్ అనుష్కల సాన్నిహిత్యం రీత్యా ఇలాంటి బహుమతుల వార్తలు రావడంలో ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా అనుష్క పుట్టినరోజునాడు విడుదలైన ‘భాగమతి’ ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈసినిమా నిర్మాతలకు మన తెలుగు రాష్ట్రాలలోని వివిధ బయ్యర్ల నుండి విపరీతమైన ఆఫర్స్ వస్తున్నాయని టాక్. ‘బాహుబలి 2’ తరువాత అనుష్క నటించిన సినిమా ఇప్పటి వరకు ఏదీ విడుదల కాని నేపధ్యంలో ఆ క్రేజ్ ను యూవీ క్రియేషన్స్ చాల వ్యూహాత్మకంగా తమ ‘భాగమతి’ కి ఉపయోగించుకో బోతోంది అని అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: