తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న నేచురల్ స్టార్ నాని తాజాగా ‘ఎంసీఏ’టీజర్‌తో అభిమానుల ముందుకు వచ్చారు.  ఇప్పటి వరకు లవ్, ఎంట్రటైన్ మెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన నాని ఇప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయిగా తనదైన మార్క్ చూపించబోతున్నాడు.  నాని-సాయిపల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న లవ్ ఎంటర్టైనర్ మూవీ ‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయ్’ టీజర్‌ను ముందుగా ప్రకటించినట్టే ఈ రోజు రిలీజ్ చేశారు.  ఎంసీఏ అంటే క్వాలిఫికేషన్ కాదని.. అదో మైండ్ సెట్ అంటూ కొత్త అర్థం చెప్తూ..నాని కొట్టే డైలాగ్స్ చాలా బాగున్నాయి. 
Image result for nani mca posters
ఎప్పుడైనా షర్ట్ బటన్ ఊడిపోతే పిన్నీస్ పెట్టి మేనేజ్ చేశావా? మామూలు జీన్స్‌ను బ్లేడ్‌తో కట్ చేసి టోన్ జీన్స్‌లా కలర్ ఇచ్చావా? అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్ మీదు మీద వెళ్తూ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఫ్యామిలీ ఫోటోను ఊహించుకున్నావా? ఇవన్నీ చేసేవాడే మిడిల్ క్లాస్ అబ్బాయ్ అంటూ నాని అంటుంటే నిజంగా ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు తనని తాను చూసుకున్నట్లు అనిపిస్తుంది. 
Image result for nani mca posters
మరో ట్విస్ట్ ఏంటంటే..నువ్ నాకు బాగా నచ్చేశావ్ ఎప్పుడు పెళ్లిచేసుకుందాం అంటూ  సాయి పల్లవి పువ్వు ఇచ్చి పెళ్లికి ప్రపోజ్ చేయడం కాస్త వెరైటీగా అనిపించింది.  ఫిదా సినిమాతో తెలంగాణ యాసలో మాట్లాడిన సాయిపల్లవి ఈ సినిమాలో నానితో మరో విజయం సాధించబోతుందని తెలుస్తుంది.
Image result for nani mca posters
ఇక రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ‘మేం.. మిడిల్ క్లాస్ అబ్బాయిలం’ అంటూ దరువు టీజర్‌కి అదనపు ఆకర్షణగా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: