తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో తన అందచందాలు, అద్భుతమైన నాట్యంతో అందరి మనసు దోచిన హీరోయిన జయప్రద.  తర్వాత కాలాంలో రాజకీయాల్లోకి వెళ్లిన ఆమె అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు.  తాజాగా జయప్రద లీడ్‌ రోల్‌లో పూర్ణ, సాక్షి చౌదరి, రామ్,ఇంద్ర సాయికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిస్టారికల్ అడ్వెంచర్ మూవీ ‘సువర్ణసుందరి’. సూర్య దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎమ్.ఎల్.లక్ష్మి ఈ మూవీని తెరకెక్కించారు. 
Image result for suvarna sundari posters
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో హర్రర్, కామెడీ, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ‘సువర్ణసుందరి’ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది.  మొదటి నుంచి చెబుతన్నట్లు ఈ చిత్రంలో గ్రాఫిక్ మాయాజాలంతో పాటు హర్రర్, హిస్టర్ మేలవించారు. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతుంది’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ‘సువర్ణ సుందరి’ మూవీ టీజర్ విజువల్ వండర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Related image
గతానికి - భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రద పాత్రను సరికొత్తగా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్. డిజైన్ చేశాడు.  చరిత్ర దాచిన చారిత్రక తప్పిందం అంటూ ఎలు మహంతి విజువల్స్.. దర్శకుడి టేకింగ్.. పూర్ణ, సాక్షి చౌదరిల అందాల రాజసం.. జయప్రద స్టన్నింగ్ లుక్.. వెరసి ‘సువర్ణసుంద’ టీజర్  ని చూస్తుంటే..సినిమాపై అటోమెటిక్ గా అంచనాలు పెరిగిపోతున్నాయి. 
Image result for suvarna sundari posters
జయప్రద, పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించగా.. యువ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నారు.   ‘సువర్ణసుందరి’ చిత్రం వచ్చే డిసెంబర్‌లో విడుదల కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: