తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త హీరోలు, దర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో సక్సెస్ బాటలో నడిచేవారు నడుస్తున్నారు..కంటికి కనపడకుండా పోయేవాళ్లూ ఉన్నారు.  ఈ మద్య రిలీజ్ అయిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకులు సందీప్ వంగ.  ఇక పెళ్లి చూపులు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. 
Image result for అర్జున్ రెడ్డి
తెలుగు లో ఈ సినిమా హిట్ కావడంతో ఇతర భాషల్లోకి రిమేక్ చేయాలని ఆలోచిస్తున్నారు.  బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ ‘అర్జున్ రెడ్డి’ గా కనిపించబోతున్నాడట.  తమిళంలో విక్రమ్ తనయుడు ఈ సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.
Image result for vikram son
‘‘అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్ పేరు ‘వర్మ’ అంట.. ఆ పేరు ఎక్కడో విన్నట్టు, గుర్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఉంది’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్న వర్మ, ఓ పోస్టర్ ను జతపరిచారు.విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: