సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కలలు కని వస్తారు.  ఒక్కసారి తెరపై కానీ, తెర వెనుక కానీ చాన్స్ దొరికితే చాలు అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు.  ముఖ్యంగా దర్శకత్వం, నటించడం అంటే చాలా మంది యువతకు ఎంతో పుణ్యం చేస్తే దక్కే అవకాశం అని భావిస్తారు.  అలాంటి సినిమా ఇండస్ట్రీకి వచ్చి కష్టాలు, కన్నీళ్ల పాలు అయ్యే వారు కూడా ఎంతో మంది ఉన్నారు.
इन्हें कहते थे भोजपुरी सिनेमा के शोमैन, फिल्म रिलीज से पहले लगाई फांसी
అలా కష్టాలు ఎదుర్కొన్నవారు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.  ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి.  తాజాగా భోజ్‌పురి చిత్రాల దర్శకుడు షాద్ కుమార్ (50) ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  మధ్యాహ్నం 1.40 గంటలకు న్యూ సలోనీ హైట్స్ కోఆపరేటివ్ సొసైటీలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
इन्हें कहते थे भोजपुरी सिनेमा के शोमैन, फिल्म रिलीज से पहले लगाई फांसी
షంషాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏక్ లైలా’, ‘టీన్ చైలా’, ‘బెయిల్ తోహ్రా సె ప్యార్’, తుమ్హారే ప్యార్ కె కసమ్’ వంటి పలు భోజ్‌పురి చిత్రాలు విజయవంతమయ్యాయి. ఆయన తాజా చిత్రం ‘స్వర్గ్’ ఈనెల 24న విడుదల కావాల్సి ఉంది. పలు చిత్రాలు తీసి ఆర్థికంగా నష్టపోవడంతో గత కొంతకాలంగా తన భర్త తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు బోనా షంషాద్ పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: