తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి నమిత.  ఈ అమ్మడు తెలుగులో నటించిన జెమిని, సొంతం సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.  తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన కొన్నాళ్లకే బొద్దుగా తయారైంది. దక్షిణాది ముద్దుగుమ్మ నమిత ఎవరితోనో సహజీవనం చేస్తోందని, పెళ్లి చేసుకుందని ఇటీవలి కాలంలో వదంతులు వెలువడిన విషయం తెలిసిందే.
Image result for namitha marriage
ఈ వార్తలకు చెక్ పెడుతూ నమిత తన పెళ్లి గురించి తాజా ప్రకటన చేసింది.  ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరాను ఈ నెల 24న వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ పెళ్లిపై వీరిద్దరూ స్పష్టతను ఇస్తూ అభిమానుల ఆశీర్వాదాలను కోరుతూ.. ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.తన కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో నమిత తన బాయ్ ఫ్రెండ్ వీర్ (వీరేంద్ర చౌదరి)తో కలిసి తమ వివాహంపై మాట్లాడింది.

హాయ్ ఫ్రెండ్స్, మీకో శుభవార్త చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. నవంబర్ 24, 2017 న మేము పెళ్లి చేసుకోబోతున్నాం. అభిమానుల ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నాం’ అని యూట్యూట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో పేర్కొంది. ఈ వీడియోలో నమిత, తనకు కాబోయే భర్త వీర్ తదితరులు ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: