చాలరోజుల త‌ర్వాత సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ `గ‌రుడ‌వేగ‌` సినిమాతో  హిట్‌ను అందుకున్న నేపధ్యంలో అనేక మీడియా సంస్థలు రాజశేఖర్ తో ఇంటర్వ్యూలు చేస్తూ  చాలాకాలంగా చాలమంది మరిచిపోయిన రాజశేఖర్ కు తిరిగి మీడియా  హైక్ లోకి తీసుకువస్తున్నాయి. ఈనేపధ్యంలో రాజశేఖర్ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ అలీ తీరుపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

పవన్ కళ్యాణ్ నటించిన `గ‌బ్బ‌ర్‌సింగ్‌` సినిమా గురించి రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ  ఆసినిమాలో అంత్యాక్ష‌రి సీన్‌ లో  తనను ఇమిటేట్ చేస్తూ ఒక ఆర్టిస్ట్ చేసిన విష‌యంపై రాజ‌శేఖ‌ర్ స్పందించాదు. ‘ఆ సీన్‌ లో అలీ కూడా ఉన్నారు. ఆయ‌న నాకు చాలా క్లోజ్‌. ఆ సీన్ వ‌ద్ద‌ని ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ కు అలీ చెప్పుండాల్సింది. లేదా ఆ సీన్ నుంచి త‌న‌ను త‌ప్పించ‌మ‌ని అడిగుండాల్సింది. కానీ ఆయన చేశారు. నాకు కొంచెం బాధ‌నిపించింది. అలీగారిని క‌లిసిన‌పుడు అడుగుదామ‌నుకున్నాను. కానీ అయిపోయిన దాని గురించి మ‌ళ్లీ అడ‌గ‌కూడ‌ద‌ని ఊరుకున్నాను’ అంటూ అలీ పై తన అసంతృప్తిని వ్యక్త పరిచాడు రాజశేఖర్. 

ఇదే సందర్భంలో రాజశేఖర్ మాట్లాడుతూ  ప్రస్తుతం తాను  భావోద్వేగాల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని బయటపెడుతూ ఒకపక్క  తన తల్లిమరణం మరోపక్క జీవిత సోదరుడి మృతి మానసికంగా తనను క్రుంగ తీసిన విషయాన్ని బయటపెట్టాడు.  ఇదే సందర్భంలో తన వ్యక్తిగత జీవితం పై వచ్చిన గాసిప్పుల గురించి మాట్లాడుతూ  తానూ శ్రీరాముడిని కాదు అంటూ తన పై తాను సెటైర్లు వేసుకున్నాడు. పెళ్లికి ముందు చాల అఫైర్లు ఉన్నాయని అంటూ తాను శ్రీరాముడుని కాదు శ్రీకృష్ణుడిని కాదు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు.  

ఇదే సందర్భంలో రాజశేఖర్ మాట్లాడుతూ ‘గరుడవేగ పార్ట్2’ లో బాలకృష్ణ హీరోగా చేస్తే తనకు విలన్ గా చేయాలి అన్న విషయాన్ని బయట పెట్టాడు. అయితే  త్వరలో  తాను ఒక కుటుంబ కథా చిత్రం చేయబోతున్న విషయాన్ని బయట పెడుతూ ఆ చిత్రంలో తన  భార్య జీవిత కూడ నటించబోతున్న  విషయానికి సంబంధించిన లీకులు ఇస్తున్నాడు. ఏది ఏమైనా అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టాన్ని రాజశేఖర్ తనకు అవకాశాలుగా ఎంత వరకు మార్చుకోగలడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: