సినీనటులపై తమిళుల అభిమానం పరాకాష్ఠకు చేరిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి పరుగులుపెడుతూ దూసుకు వస్తున్నారు కమలహసన్  ఒకప్రక్క.. కాదు..కాదు ఇప్పటికే వచ్చేశానంటున్నాడు, మరో ప్రక్క తలైవాగా తమిళ అభిమానులచే పిలవబడుతున్న రజనీకాంత్ రానున్న జన్మదినాన అంటే డిసెంబర్ 12న తన రాజకీయ ప్రవేశాన్ని గురించి స్పష్టమైన ప్రకటన చేయనున్నారనే ప్రచారం అంతర్జాలంలో వైరల్‌ అవుతోంది. 
Image result for most beautiful nayanatara the talaivi
కోలీవుడ్‌ లో "తలైవా" గా చాలా మంది ఎదిగారు. అయితే అనూహ్యంగా విశ్వనటుడు, లోకనాయకుడు కమల్ హసన్ దూసు కొచ్చారు దాదాపుగా రజనీకాంత్ కు పోటీగానో? లేదా ఆయనకు చెక్ పెట్టటానికా? అన్నట్లు ఉన్న ఈ ప్రచారవిషయాలు జగ మెరిగిన సత్యమే. ప్రస్తుతం కొత్తగా ఈ 'తలైవి' పేరు వేలుగులోకి వచ్చింది, అభిమానులకు "తలైవి" గా మారిన కథానాయకి నయనతార భవిష్యత్‌ ను కూడా రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు కూడా జరిగిపోతున్నాయి. 

Image result for most beautiful nayanatara the talaivi

ఇంతకు ముందు "లెడీ సూపర్‌స్టార్‌" అంటే విజయశాంతినే.  ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత నటనకు దూరంగా ఉండడంతో మరొకరి కోసం ఆ బిరుదు ఎదురు చూస్తోంది. చాలా కాలం తర్వాత హీరోయిన్‌ నయనతార అభిమానులతో లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా నటించిన "అరమ్‌" చిత్రం ఇటీవల వెండితెరపై విజయవిహారమే చేసింది. కనకవర్షం కురిసింది. 

Related image

ఈ చిత్రంలో కలెక్టర్‌గా నయనతార పాత్రపోషణ విమర్శకులను సైతం మెప్పించింది. ఇక ప్రేక్షకులైతే బ్రహ్మరథం పడుతు న్నారు. ఆ సంతోషంలో థియేటర్లను విజిట్‌ చేస్తున్న నయనతారను అభిమానులు తలైవి అంటూ పేర్కొనడం విశేషం. ఇదంతా చూస్తుంటే ఆమెకి రాజకీయ కథానాయకి అయ్యే యోగం పట్టుకుందని అంటున్నారు తమిళ ప్రజలు. కాగా అరమ్‌ సక్సెస్‌ బాటలో పయనించడంతో ఆ చిత్ర నిర్మాత అరమ్‌ కు సీక్వెల్‌ నిర్మిస్తానని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: