డబల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నాని క్రేజ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తనకు ఏర్పడ్డ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ నాని కూడ ఒక్కరోజు ఖాళీ లేకుండా సినిమాలలో నటిస్తూ సంవత్సరానికి మూడు సినిమాలు తనవి విడుదల అయ్యే విధంగా పక్కా ప్లాన్ తో దూసుకుపోతున్నాడు. వచ్చేనెల డిసెంబర్ లో విడుదల కాబోతున్న ‘ఎమ్ సి ఎ’ పై భారీ అంచనాలు ఉండటంతో నాని సినిమాలు అంటే చాలు బయ్యర్లు క్యూ కడుతున్నారు.  

అయితే సినిమాల కథలను ఎంచుకునే విషయంలో చాల తెలివిగా వ్యవహరిస్తున్న నాని తన లుక్ ను అన్ని సినిమాలలోను ఒకే విధంగా చూపెడుతూ ఉండటంతో ప్రేక్షకులు భవిష్యత్ లో బోర్ ఫీల్ అయ్యే ఆస్కారం ఉంది అంటూ కొందరు నాని సన్నిహితులు ఈ నేచురల్ స్టార్ ను హెచ్చరిస్తున్నట్లు టాక్. నాని తన భవిష్యత్తులో రాబోయే సినిమాలకు సంబంధించి ఎటువంటి మేకోవర్ చేసుకుంటే బాగుంటుంది అని కొంతమంది సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

నాని ఇప్పటి వరకు తాను నటించే పాత్రలో తన నటనకు సంబంధించి శ్రద్ధ తీసుకున్న సందర్భాలు చాల ఉన్నాయి కానీ కనీసం తన హెయిర్ స్టైల్ విషయంలో కూడ నాని ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు చేసుకోకుండా ఒకే తరహాలో కనిపిస్తూ ఉండటం మంచిది కాదు అన్న సలహాలు నానీకి వస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా నాని డైలాగ్ డెలివరీలో కూడ ఒకే తరహాలో చెపుతూ ఉండటంతో భవిష్యత్ లో నాని ఈవిషయాలలో మార్పు చేసుకోకపోతే క్రేజ్ తగ్గిపోయే ఆస్కారం ఉంది అన్నది కొందరి వాదన. 

ప్రస్తుతతరం యంగ్ హీరోలలో ప్రతి హీరో వారు నటించే సినిమా సినిమాకు లుక్ విషయంలో మార్పులు పాటిస్తున్న నేపధ్యంలో ఇలాంటి మార్పులు నాని విషయంలో కూడ భవిష్యత్తులో వచ్చే ఆస్కారం ఉంది అనుకోవాలి. అయితే అన్ని విషయాలలోనూ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నాని తన లుక్ పై వస్తున్న కామెంట్స్ ను చూసి ఎలాంటి మార్పులు చేసుకుంటాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: