తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు.  అంతే కాదు ఎన్నో వందల అభిమాన సంఘాలు ఉన్నాయి.  తాజాగా చిరంజీవికి అమితంగా అభిమానించే ఓ అభిమాని తన పెళ్లిని కూడా తన అభిమాననటుడి ముందే చేసుకోవాలని భావించాడు. అంతే చిరంజీవి ఉన్న పెద్ద ఫ్లెక్సీ చేయించి దానిముందే పెళ్లి తంతు జరుపుకున్నాడు.

ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిరంజివి దాకా చేరింది.   తనని అమితంగా అభిమానించే ఓ అభిమాని తనపట్ల చూపిన గౌరవానికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ఆకుల భాస్కర్ రావు అనే తన వీరాభిమాని అతడి పెళ్లి విషయంలో చూపిన అభిమానం మెగాస్టార్‌ని ఉక్కిరిబిక్కిరయ్యేలా చేసింది. చిరు ఆ నవ దంపతులని ఏకంగా తమ ఇంటికే ఆహ్వానించారు.

వారి అభిమానానికి ఏం బహూకరించినా తక్కువే అంటూ వారికి పట్టుబట్టలు పెట్టి సత్కరించారు మెగాస్టార్-సురేఖ దంపతులు. అంతటితో సరిపెట్టకుండా భాస్కర్ రావు దంపతులని రామ్ చరణ్ పాల్గొంటున్న రంగస్థలం సినిమా షూటింగ్ స్పాట్‌కి వెళ్లే ఏర్పాటు కూడా చేశారు.కొత్త జంటను రామ్‌చరణ్ రిసీవ్ చేసుకుని, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: