విలక్షణ నటుడు  ప్రకాష్ రాజ్ ఏవిషయం పై అయినా కుండబద్ధలు కొట్టేలా మాట్లాడటంలోముందు వరసలో ఉంటాడు .ఈ మధ్యకాలంలో దక్షిణాదికి చెందిన చాలా మంది టాప్ హీరోలు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపధ్యంలో వారిని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ ఈ కామెంట్స్ చేసాడు.

 తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌ల తో పాటు కన్నడ టాప్ హీరో ఉపేంద్ర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు మరో ఏడాది దాటిన తరువాత రాబోతున్న ఎన్నికల సంగ్రామానికి సిద్ధం అవుతున్న నేపధ్యం లో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ చాలా ప్రాధాన్యత ను ఏర్పరచు కున్నాయి.  సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం దేశానికి ఒక విపత్తులాంటిది అని ప్రకాశ్ రాజ్  అన్న మాటల వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ఇప్పడు చర్చలు జరుగుతున్నాయి. 

ఈ వ్యాఖ్యలు కొత్త కొత్త వివాదాలకు తెరతీసేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు .ఇదే సందర్భం లో ప్రకాష్ రాజ్ మరింత వివరంగా  మాట్లాడుతూ సమాజంలోని లోటుపాట్లను నాయకుల తప్పుల్ని ఎత్తి చూపే హక్కు తనకు ఉందని, నిర్భయంగా మాట్లాడే భావ ప్రకటనా స్వాంతంత్య్రాన్ని రాజ్యాంగం తనకు కల్పించింది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు రజనీ కాంత్ కమల్ హాసన్ కన్నడ నటుడు ఉపేంద్రలు పార్టీ పెట్టి తమకు ఓట్లు వేయాలని అడిగితే వారికి ఓటు వేయద్దని తాను ప్రచారం చేస్తానని ప్రకాశ్ రాజ్ చెపుతున్నాడు.
 
అయితే ఈ లిస్టు లో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను చేర్చనప్పటికీ  ఇవేమాటలు పవన్ కు కూడా  వర్తిస్తాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తనకు జెండాలు అజెండాలు అస్సలు లేవని  ప్రకాశ్ రాజ్ చెపుతూ ఉన్నా దక్షిణాదికి చెందిన టాప్ హీరోలను అందరినీ ప్రకాష్ రాజ్ టార్గెట్ చేయడం ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో హాట్ న్యూస్ గా మారింది .



మరింత సమాచారం తెలుసుకోండి: