టెలివిజన్ రంగంలో ఒకప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కట్టిపడేసిన చారిత్రాత్మక సిరియల్ ‘రామాయణం’.  అప్పట్లో ఈ సీరియల్ ఆదివారం వచ్చేది..దాంతో చాలా మంది టివికి అతుక్కుపోయేవారు.  90వ దశాబ్ధంలో ప్రసారమైన ‘రామాయణం’ సీరియల్‌ను చాలామంది చూసి ఉంటారు.  రామాయణంలో దీపికా చికిలియా సీతాదేవి పాత్ర పోషించింది. 

ఇక సీత పాత్రలో దీపికా చికిలియా ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు.  ఈ సిరియలో తో దీపికా బాగా పాపులర్ కావడంతో బాలీవుడ్ లో హీరోయిన్ గా చాన్స్ దక్కించుకున్నారు.   

‘సున్ మేరీ లైలా’ అనే బాలీవుడ్ చిత్రంలో నటించిన దీపిక తర్వాత హీరోయిన్ గా రాణించలేక పోయారు.  ఆ తరువాత కూడా ఆమె పలు సినిమాలు, సీరియళ్లలో నటించింది. అనంతరం దీపిక కాస్త విరామం తీసుకుంది. ప్రస్తుతం ‘గాలిబ్’ అనే సినిమాలో తల్లి పాత్ర పోషిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: