గత మూడు సంవత్సరాల నుంచి బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో బాగా పాపులర్ అయ్యింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ కోసం వేచి చూసే ప్రేక్షకులు పెరిగిపోయారు.  జబర్ధస్త్ కామెడీ షో తో చాలా మంది మంచి పోజీషన్లోకి వెళ్లారు.  ముఖ్యంగా యాంకర్లు అనసూయ, రష్మీలు ఇప్పుడు వెండితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు.  ఇందులో నటించే కమెడియన్లు వెండితెరపై తమ జోరు కొనసాగిస్తున్నారు.  అయితే గతంలో జబర్ధస్త్ కామెడీ షో  కొన్ని వివాదాలు చుట్టు ముట్టాయి. తాజాగా మరోసారి జబర్ధస్త్ కామెడీ షో  వార్తల్లోకి వచ్చింది. 
Image result for jabardasth comedy show
జబర్ధస్త్ కామెడీ షో పంచ్ డైలాగులు వేస్తూ క‌డుపుబ్బా న‌వ్వించే హైప‌ర్ ఆదిపై సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి ఆగ్ర‌హం వ్యక్తం చేశాడు. జబర్దస్త్‌లో హైపర్‌ ఆది స్కిట్‌లో భాగంగా ఇటీవ‌ల ఒక డైలాగు చెప్పాడు. వివాహం అనేది సినిమా తీసినంత కష్టం అని, కానీ ప్రేమ మాత్రం ముందు పొట్ట‌ వేసుకొని, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ అని డైలాగ్ వేశాడు. 
Related image
గతంలో కూడా ఓ స్కిట్ తో కత్తిమహేష్ ని విమర్శించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన మ‌హేశ్ క‌త్తి త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.'అవును నాకు పొట్ట ఉంది, బట్ట ఉంది' అని వ్యాఖ్యానించాడు. మనుషులు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారని అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉండడమే ఈ ప్రపంచం అని చెప్పాడు.
Image result for jabardasth comedy show
కాస్త భిన్నంగా ఉంటే జోకర్స్‌ అయిపోతామా? అని ప్ర‌శ్నించాడు. ఇలా ఉన్నాన‌ని తాను బాధ‌ప‌డిపోన‌ని, త‌న‌ది అటువంటి మెంటాలిటీ కాద‌ని చెప్పుకొచ్చాడు. మనుషుల మీద వారు వేసుకునే బట్టల మీద ఇలా కామెడీ చేస్తూ అపహస్యం చేస్తున్న దానిని కామెడీ అంటున్నార‌ని, దాన్ని చూసి ఆనంద‌ప‌డుతున్నార‌ని చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: