ఈ మద్య ప్రతి ప్రజాధరణ ఉన్న సినిమా కథానాయకుడో నటుడొ నటో రాజకీయాల్లోకి దూసుకురావటానికి ఉవ్విళ్ళూరు తున్నరు. సినిమావాళ్ళో పేరు సంపాదించుకున్న వారికి రాజ్కీయాల్లోకి రావటం ఒక ప్రమోషన్ గా భావిస్తున్నారు. ఈ విషయములో ప్రకాష్ రాజ్ వారికి ఒక చక్కటి సందేశం ఇచ్చారు. అయితే ఆ వార్తను రిపోర్ట్ చేసిన వారు వెరేగా అర్ధం చేసుకోవటం ప్రకాష్ రాజ్ పై విమర్శలకు కారణమైంది.  

prakash raj about political entry of cine stars కోసం చిత్ర ఫలితం

ప్రకాష్‌ రాజ్‌ బెంగుళూరు ప్రెస్-క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య వివిధరాష్ట్రాల్లో సినీనటులు రాజకీయాల్లోకి రావడంపై అడిగిన ప్రశ్నకు ప్రకాష్‌ రాజ్‌ చక్కటి సమాధానంచెప్పాడు. సినిమా, నటన వేరు వేరు అంశాలనీ, రాజకీయాల్లోకి రావాలనుకున్న నటులకు దేశం గురించి, ప్రజా సమస్యల గురించి మంచి అవగాహన ఉండాలి. మంచి కమిట్‌మెంట్‌ ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చే నటులు తమకు వివిధ సమస్యల పట్ల ఉన్న అవగాహన ఏమిటి? దేశం పట్ల తమ నిబద్దత ఏమిటి? అని ప్రశ్నించుకోవాలి. 

prakash raj about political entry of cine stars కోసం చిత్ర ఫలితం

దానిని బట్టే ప్రజలు ఓటేయ్యాలి. తమ అభిమాన నటుడన్న కారణంతో సమర్థించడం, ఓట్లేయడం సమంజసం కాదు అని ప్రకాష్‌ రాజ్‌ చెప్పారు. అయితే కొందరు జర్నలిస్టులు  ”గతంలో ప్రకాష్‌ రాజ్‌ చేసిన ప్రకటనలకు భిన్నంగా మాట్లాడాడని, యూ టర్న్‌ తీసుకున్నాడని” రాసేశారు. మరికొంత మంది జర్నలిస్టులు ”సినీ నటులకు ఓటు వెయ్యవద్దని నేను ప్రచారం చేస్తా” అని ప్రకాష్‌ రాజ్‌ చెప్పాడంటూ వార్తలు రాసేశారు.

prakash raj about political entry of cine stars కోసం చిత్ర ఫలితం

దీనికి మండిపడ్డ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, పవన్‌ కళ్యాణ్‌, ఉపేంద్ర అభిమానులు ప్రకాష్‌ రాజ్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా లో పోస్టులు పెట్టారు. వీటికి స్పందించిన ప్రకాష్‌ రాజ్‌ బెంగుళూరు ప్రెస్‌ క్లబ్‌ కు ఒక లెటర్‌ రాశారు. మీరు అడిగిన ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానం ఏమిటి? మీరు రాసిందేమిటి? ఇంత బాధ్యతారహితంగా రాస్తారా? అని నిలదీశాడు.

prakash raj about political entry of cine stars కోసం చిత్ర ఫలితం

విశేషం ఏమిటంటే ఇటీవలి కాలంలో ప్రకాష్‌ రాజ్‌ ఇచ్చిన ఇంటర్య్వూలను చూసిన వాళ్లు సామాజిక రాజకీయ వ్యవహారాల మీద ప్రకాష్‌ రాజ్‌ కు ఉన్న అవగాహనను చూసి ఆశ్చర్యపోతున్నారు. సమాజం గురించి మన రాజకీయ నాయకుల్లో,జర్నలిస్టు లలో కనీసం 10 శాతం మందికైనా ప్రకాష్‌ రాజ్‌ కు ఉన్న స్పష్టమైన అవగాహన ఉండి ఉంటే ఈ దేశంలో రాజకీయా లు, జర్నలిజము ఇంత దౌర్భగ్య స్థితిలో ఉండేవి కావని మేథావులు అభిప్రాయ పడుతున్నారు.

prakash raj about political entry of cine stars కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: