మొన్న సాయంత్రం జరిగిన చైతు సమంతల మ్యారేజ్ రిసెప్షన్ కు ఎందరో సినిమా సెలిబ్రెటీలు వచ్చినా అందరి దృష్టి మాత్రం ఆఫంక్షన్ కు వచ్చిన అల్లుఅర్జున్ పైనే పడింది. స్టైలిష్ స్టార్ గా తన అభిమానులచేత పిలిపించుకునే అల్లుఅర్జున్ తన లుక్ విషయంలో కూడ చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. 

అందుకునే బన్ని ఒక్కో  సినిమాలో ఒకొక్క హెయిర్ స్టైల్ తో ఆకట్టుకుంటూ ఉంటాడు. అంతేకాదు ప్రతీ సినిమాకి తన స్టైలింగ్ ను కంప్లీట్ చేంజ్  చేసేస్తూ ఉంటాడు. ఈపరిస్థితుల నేపధ్యంలో బన్నీ లేటెస్ట్ గా నటిస్తున్న ‘నా పేరు సూర్య’  మూవీ షూటింగ్ మొదలలై కొన్ని నెలలు అవుతున్నా ఇప్పటివరకూ మూవీకి సంబంధించిన చిన్న లీక్ కూడా బయటకు రాకపోవడంతో ఈసినిమాలో అల్లుఅర్జున్ ఎలా కనిపిస్తాడు అన్నఆసక్తి చాలమందిలో ఉంది. 

ఈ సినిమా రిలీజ్ కి ఇంకా ఆరునెలల సమయం ఉంది కాబట్టి అప్పుడే ఫస్ట్ లుక్ ను బయటకు తెచ్చే ఉద్దేశంలో ఈ సినిమా నిర్మాతలు లేరు. ఇలాంటి పరిస్థితులలో  నాగచైతన్య-సమంతల రిసెప్షన్ కారణంగా అల్లుఅర్జున్ లేటెస్ట్ మూవీ లుక్ ఏమిటో జనాలకు తెలిసిపోయింది. ఈ రిసెప్షన్ లో చైతు, సామ్ లే మెయిన్ అట్రాక్షన్ అయినా బన్నీ లుక్స్ గురించి  హాట్ డిస్కషన్స్ మొదలైపోయాయి. 

కనిపించీ కనిపించకుండా ఉన్న గెడ్డం మిలిటరీ హెయిర్ కట్ చూస్తే ‘నా పేరు సూర్య’ సినిమా కోసమే బన్నీ ఇలా ప్రిపేర్ అయ్యాడనే సంగతి  తెలిసిపోవడంతో ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలమంది బన్ని లేటెస్ట్ లుక్ ను చూస్తూ ఉండిపోయారు. ‘నా పేరు సూర్య’ చిత్రంలో ఆర్మీఆఫీసర్ గా కనిపించబోతున్న బన్నీ ఇలా అనుకోకుండా సమంత చైతుల మ్యారేజ్  రిసెప్షన్ ఫంక్షన్ లో తన లుక్ ను బయటపెట్టాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: