యాంగ్రీ యంగ్‌మన్‌కు పుష్కర కాలం తర్వాత సక్సెస్‌ దక్కింది. ఆ సక్సెస్‌ మామూలు సక్సెస్‌ కాదు, అదృష్టంతో కలిసి వచ్చిన సక్సెస్‌. కొన్ని సినిమాలకు సక్సెస్‌ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్స్‌ దక్కించుకోలేక పోతాయి. కారణం అదృష్టం కలిసి రాకపోవడంతో పాటు ఇతర సినిమాల పోటీ. కాని గరుడవేగకు ఇతర సినిమాలు పోటీ లేక పోవడంతో పాటు అదృష్టం కలిసి వచ్చింది. 


ఈ సినిమాతో పాటు విడుదలైన ఇతర చిత్రాలు పెద్దగా సత్తా చాటలేక పోయాయి. గరుడవేగ స్థాయిని ఆ చిత్రాలు అందుకోలేక పోవడంతో ప్రేక్షకులు గరుడవేగను మాత్రమే ఆధరిస్తున్నారు. మొదటి వారం తర్వాత గరుడవేగకు పోటీగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ వద్దకు వచ్చాయి. నాలుగు సినిమాల్లో కనీసం ఒక్కటి అంటే ఒక్కటి కూడా గరుడవేగకు బ్రేక్‌ వేయలేక పోయింది. గరుడవేగ చిత్రం ప్రస్తుతం మంచి కలెక్షన్స్‌తో దూసుకు పోతుంది. 


రెండవ వారంలో కూడా గరుడవేగ చిత్రానికి మంచి కలెక్షన్స్‌ వస్తున్న నేపథ్యంలో భారీ లాభాల బాటలో నిర్మాత ఉన్నాడు. ప్రస్తుతం  బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులకు మరో ఆప్షన్‌ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గరుడవేగను మాత్రమే చూస్తున్నారు. దాంతో గరుడవేగ కలెక్షన్స్‌ భారీగా వస్తున్నాయి. ఇక ఈ వారంలో బాక్సాఫీస్‌ వద్దకు దాదాపు 10 సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ పది సినిమాల్లోనైనా గరుడవేగ చిత్రాన్ని అడ్డుకునే సినిమాలు ఉన్నాయా అనేది చూడాలి.  


ఇక ఈ సినిమాకు వచ్చిన మైలేజ్ తో రాజశేఖర్ ఇక నుండి వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు. కచ్చితంగా మళ్లీ యాంగ్రీ యంగ్ మన్ సక్సెస్ ట్రాక్ లో కొనసాగుతాడని చెప్పొచ్చు. గరుడవేగ ఇచ్చిన సక్సెస్ కిక్ తో రాజశేఖర్ లోని ఉత్సాహం రెట్టింపు అయ్యిందని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: