వరుస పరాజయాలతో సతమతమైపోతూ హిట్ అన్న పదాన్ని మరిచిపోయి గత రెండు సంవత్సరాలుగా ఎంతో టెన్షన్ అనుభవించిన రవితేజాకు ‘రాజా ది గ్రేట్’ విజయం ఊరటను ఇచ్చింది. అయితే ఈవిజయంతో జోష్ లో ఉన్న మాస్ మహారాజాకు రాజశేఖర్ ‘గరుడవేగ’ ఒకచోట ఊహించని షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. రెండు వారాల క్రితం విడుదలైన ‘గరుడవేగ’ కు చాలామంచి టాక్ వచ్చినా ఆ టాక్‌కు తగ్గట్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మాత్రం రాలేదు. 

రెండో వారాంతం ముగిసేసరికి ఈ చిత్రంకు 6కోట్లకు అటుఇటుగా షేర్ వసూలు చేసింది అన్న వార్తలు వస్తున్నాయి.సుమారు 25 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈసినిమాకు మంచి టాక్ వచ్చినా ఇంత తక్కువ వసూళ్లు రావడం అందరికీ షాక్ ఇస్తోంది. ఈసినిమా రిలీజ్ ముందు మంచి అంచనాలు లేకపోవడం రాజశేఖర్ మార్కెట్ అంతగా లేకపోవడంతో పాటు ఆశించిన సంఖ్యలో మంచి థియేటర్లు ఇవ్వకపోవడంతో  ఈ సినిమాకు కలక్షన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం ఆశాజనకంగా లేవు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి.

అయితే అమెరికాలో మాత్రం ఈ సినిమా అంచనాల్ని మించి పెర్ఫామెన్ చేసింది. అక్కడి బయ్యర్ 32 లక్షల పెట్టుబడితో ‘గరుడవేగ’ ను కొంటె ఇప్పటిదాకా 4.5 లక్షల డాలర్లు దాదాపు 3కోట్లు వసూలు చేసి ఓవర్సీస్  బయ్యర్‌కు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. అయితే దీపావళికి విడుదలైన ‘రాజా ది గ్రేట్’ మన తెలుగు రాష్ట్రాలలో ఘన విజయం సాధించినా ఈసినిమాను కొనుక్కున్న ఓవర్సీస్ బయ్యర్ కు చెప్పుకోతగ్గ స్థాయిలో లాభాలు రాలేదు అన్న వార్తలు రావితేజాకు షాక్ ఇస్తున్నట్లు టాక్. 

అంతేకాదు ఈమూవీ ముందు విడుదలైన ‘రాజు గారి గది’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల ఓవర్సీస్ బయ్యర్ల కంటే ‘గరుడవేగ’ ఓవర్సీస్ బయ్యర్ కు భారీ లాభాలు రావడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దీనికి తోడు  గత వారాంతంలో వచ్చిన సినిమాలేవీ యుఎస్‌ తెలుగు ప్రేక్షకులలో ఎలాంటి ప్రభావం చుపెట్టని నేపధ్యం లో  గరుడవేగ కు ఇలాంటి ఊహించని విజయం ఓవర్సీస్ లో లభించింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి 



మరింత సమాచారం తెలుసుకోండి: