డబల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నాని లేటెస్ట్ మూవీ ‘ఎం సి ఎ’ కి భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈసినిమాను దిల్ రాజ్ నిర్మించిన నేపధ్యంలో ఆయనకు బయ్యర్లతో ఉన్న పరిచయాలు వల్ల నాని కెరియర్ లోనే అత్యంత భారీ స్థాయి బిజినెస్ ఈసినిమాకు జరిగినట్లు టాక్. డిసెంబర్ మూడవ వారంలో క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్న ఈమూవీ కలక్షన్స్ పై ఈసినిమా బయ్యర్లు చాల భారీ ఆశలు పెట్టుకున్నారు. 

అయితే అందరికీ షాక్ ఇస్తూ నాగార్జున అఖిల్ తో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ‘హలో’ కూడ డిసెంబర్ 22న విడుదల కాబోతోంది అని నాగ్ ప్రకటించడంతో ఇప్పుడు నాని అఖిల్ ల మధ్య డైరెక్ట్ ఫైట్ కు రంగం సిద్ధం అయింది. దర్శకుడు విక్రమ్ కుమార్ భారీ బడ్జెట్ తో అఖిల్ తో తీసిన ఈక్యూట్ లవ్ స్టోరీ ‘హలో’ చాలబాగా వచ్చింది అని చెపుతున్నారు. ఇప్పటికే ‘ఎం సి ఎ’ టీజర్ కు కూడ మంచి స్పందన రావడంతో ఇప్పుడు రెండు మంచి సినిమాల మధ్య డైరెక్ట్ వార్ జరగబోతోందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనితో ఎటువంటి పండుగల హడావిడి లేని డిసెంబర్ నెల నమ్ముకుని రెండు మంచి క్రేజీ సినిమాలు ఎందుకు పోటీ పడుతున్నాయి అన్నవిషయం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. ఇదిఇలా ఉండగా నిన్న ‘హలో’ టీజర్ రిలీజ్ గురించి సమాచారాన్ని వెల్లడిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా విభిన్నంగానే కనిపిస్తోంది. ఈ పోస్టర్ లో కూడ అఖిల్ గాలిలోకి దూసుకు వెళ్ళుతున్నాడు. 

ప్రతిసారీ ఒక కొత్త జానర్ టచ్ చేసే విక్రమ్ కుమార్ ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ సినిమాను అఖిల్ తో చేస్తున్నట్లుగా పూర్తి సంకేతాలు ఇస్తున్నాడు.  ‘హలో’ టీజర్ రేపటి రోజు అయిన నవంబరు 16న విడుదలవుతున్న నేపధ్యంలో ఈటీజర్ రిజల్ట్ ను బట్టి నాని అఖిల్ ల మధ్య జరగబోయే వార్ ఏస్థాయిలో ఉంటుందో అన్న అంచనాలు ఉంటాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: