తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో ఎన్నో సంచలనాలు సృష్టించిన చిత్రం ‘బాహుబలి’, ‘బాహుబలి 2.  దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సీరిస్  ఎన్నో అవార్డులు సాధించాయి.  ఇప్పటి  వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్, కోలీవుడ్ లకు మాత్రమే దక్కిన రికార్డులు బాహుబలి 2 చిత్రంతో మొత్తం తుడిచిపెట్టుకు పోయాయి. 
Image result for baahubali 2
‘బాహుబ‌లి 2' చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌ను గ‌ర్వ‌ప‌డేలా చేసిన సంగ‌తి తెలిసిందే.  భారత్ లో అత్యధికంగా కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రంగా బాహుబలి నిలిచింది.  అలాంటి బాహుబలి2  చిత్రంలో  దాదాపు 450 వ‌ర‌కు సిల్లీ త‌ప్పులు ఉన్నాయని మీకు తెలుసా అవును... 'బాలీవుడ్‌సిన్స్' అనే ఓ యూట్యూబ్ ఛాన‌ల్ వారు బాహుబ‌లి 2 చిత్రంలోని దాదాపు 450 త‌ప్పుల‌ను చూపిస్తూ ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు.
Image result for baahubali 2
బాహుబలి 2 లో సినిమా మొదలైనప్పటి నుంచి  త‌ల మీద అగ్ని కుండ‌ను మోసిన శివ‌గామికి చెమ‌ట ప‌ట్ట‌క‌పోవ‌డం, జూనియ‌ర్ ఆర్టిస్టుల ఓవ‌ర్‌యాక్ష‌న్‌, దండ‌లు మాయ‌మ‌వ‌డం, గాయాలు లేక‌పోవ‌డం..బాహుబలి, కట్టప్ప ఇద్దరు దేవసేనను కలిసినప్పుడు కొన్ని సన్నివేశాల్లో ఎన్నో తప్పులు తీశారు.  తప్పుల విషయంలో అన్నీ నిజం కాకపోయినా..కొన్ని త‌ప్పులు మాత్రం న‌మ్మ‌శ‌క్యంగానే ఉన్నాయి.
Image result for baahubali 2
గ‌త మూడేళ్లుగా ఈ యూట్యూబ్ ఛాన‌ల్ వారు ప్ర‌ఖ్యాత సినిమాల్లో ఉన్న త‌ప్పుల‌ను చూపిస్తూ వీడియోలు పెడుతూనే ఉన్నారు. ఇప్ప‌టి వ‌రకు దాదాపు 28 సినిమాల్లోని త‌ప్పుల‌ను వీరు చూపించారు. వీటిలో దంగ‌ల్‌, దిల్‌వాలే, పీకే వంటి సినిమాలున్నాయి.  గతంలో  'బాహుబ‌లి'  పార్ట్ 1 లో కూడా 145 త‌ప్పుల‌ను క‌నిపెట్టారు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: