రేణు దేశాయ్ రెండవ పెళ్ళికి రెడీగా ఉన్నాను అంటూ బహిరంగ ప్రకటన ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె రెండవ పెళ్ళికి పవన్ సలహాలు ఇస్తున్నాడు అన్న విషయాన్ని రేణు దేశాయ్ నోటివెంట విన్న పవన్ అభిమానులు షాక్ అవుతున్నారు.

ఈపెళ్ళి ఆలోచనలు పవన్ దృష్టికి వెళ్ళాయా అన్న మాటకు రేణు స్పందిస్తూ పవన్ తన ఆలోచనలను తెలుసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా ‘పిల్లలు ఉన్నారు కదా జాగ్రత్తగా బ్యాక్ గ్రౌండ్ చూసుకుని పెళ్ళిచేసుకో’ అని సలహాలు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టింది. దీనితో పవన్ ఈమె పెళ్ళికి నిజంగానే సలహాలు ఇస్తున్నాడా అన్న ఆశ్చర్యం ఆ మీడియా ఇంటర్వ్యూను విన్నవారికి కలుగుతోంది.

ఇదే సందర్భంలో ఆమె మరింత లోతుగా మాట్లాడుతూ తన కొడుకు అకిరా కూడ ‘అమ్మా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా’ అని అంటూ ఉంటాడు అన్న విషయాన్ని కూడ బయట పెట్టింది. తాను మెగా కుటుంబానికి దూరం అయిపోయినా తన పిల్లలు తమ సొంత పెద్దనాన్న చిరంజీవి తరుచూ వెళుతూ ఉంటారని అక్కడ వారు చాల ఆనందంగా ఉంటారు అన్న విషయాన్ని చెపుతూ లీకులు ఇస్తోంది రేణు.

అంతేకాదు విభిన్న మనస్తత్వంతో ఉండే పవన్ ఇప్పటి రాజకీయాలకు సరిపోతాడా ? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను నాలుగేళ్ల నుంచి టివి న్యూస్ లు చూడటం మానివేసానని అందువల్ల తనకు ప్రస్తుత రాజకీయాల పై అవగాహన లేదు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది రేణు. అయితే పవన్ కళ్యాణ్ ది క్లీన్ సోల్ అంటూ రేణు కామెంట్స్ చేయడమే కాకుండా ఏకంగా తన పెళ్ళికి పవన్ సలహాలు ఇస్తున్నాడు అంటూ పవన్ అభిమానులకే రివర్స్ షాక్ ఇస్తోంది రేణు దేశాయ్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: