‘లై’ సినిమాతో ఘోరమైన ఫ్లాప్ ను అందుకున్న నితిన్ ఆ ఫ్లాప్ షాక్ నుండి పాఠాలు నేర్చుకోకుండానే మరొక ప్రయోగానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి తానే నిర్మాతగా మారి ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘గరుడవేగ’ సినిమా హిట్ అయిన తరువాత దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా ఉంటుందని నితిన్ ట్వీట్ చేసాడు. 

అయితే ఈవిషయాన్ని అప్పట్లో చాలామంది లైట్ గా తీసుకున్నారు. వాస్తవానికి వేరే హీరోతో ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా చేయాలన్నది ప్లాన్. దీనికి సంబంధించి ఒక వెరైటీ కథను ప్రవీణ్ సత్తార్ ఇప్పటికే రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నితిన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రవీణ్ సత్తార్ ఈ స్క్రిప్ట్ ను నితిన్ కోసం మార్పులుచేర్పులు చేస్తున్నట్లు ఫిలింనగర్ గాసిప్.

ప్రవీణ్ సత్తారుకు నితిన్ ఇలాంటి అవకాశం ఇవ్వడానికి వెనుక కేవలం ‘గరుడవేగ’ విజయం మాత్రమే కారణం కాదు అనిఅంటున్నారు. ప్రవీణ్ సత్తారుతో సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ వ్యక్తి నితిన్ తో సినిమా ఉండేడట్లుగా ఈడీల్ ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను తీస్తారని అని అంటున్నారు. 

అయితే ‘గరుడవేగ’ హిట్ టాక్ ను తెచ్చుకున్నా కలక్షన్స్ విషయంలో ఏమాత్రం ఊహించిన ఫలితాలు అందుకోని నేపధ్యంలో ఇప్పటికే ఒక భారే ఫెయిల్యూర్ అందుకున్న నితిన్ తిరిగి మళ్ళీ ప్రవీణ్ సత్తార్ వలయంలో ఎలా చిక్కుకున్నాడు అన్న ఆశ్చర్యాన్ని చాలామంది వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాతో పాటు నిర్మాత రాధామోహన్ కు ఓ సినిమా చేయాల్సి ఉంది అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఈమధ్యలోనే ప్రవీణ్ సత్తార్ నితిన్ ల మూవీ ఉంటుందా లేక ఉండదా అనే విషయం పై ప్రస్తుతానికి సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి: