సౌత్ ఇండియన్ సినిమాలలో వ్యాంప్ క్యారెక్టర్ లతో విపరీతమైన ఫేమస్ గా మారిన భువనేశ్వరి ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అనేక సినిమాల్లో మనకి కనిపించే భువనేశ్వరి ముఖ్యంగా బాయ్స్ సినిమా తో ఫేమస్ అయ్యారు, ఆమె కొడుకు ఇప్పుడు జైలుకి వెళ్ళడం సంచలనం కలిగిస్తోంది.

ఒక కాలేజీ లేడీ స్టూడెంట్ ని పెళ్లి చేసుకోమని వేధిస్తూ ఇందులో ఇరుక్కున్నాడు అతను. చెన్నైలోని తిరుమలై నగర్, ఏంజల్ వీధిలో భువనేశ్వరి, ఆమె కుమారుడు మిధున్ శ్రీనివాసన్ (23) నివసిస్తున్నారు. అన్నానగర్ లోని ఓ యువతితో అతనికి ఫేస్ బుక్ మాధ్యమంగా స్నేహం ఏర్పడి, అది సన్నిహిత సంబంధంగా మారింది. ఆపై తనను వివాహం చేసుకోవాలని ఆ అమ్మాయిపై ఒత్తిడి తెచ్చాడు.

ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్ళికి సంబంధించి గోల గోల కూడా చేసాడు అతను. అప్పటికీ ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం తో కాలేజీ కి వెళ్లి మొత్తం అందరూ చూస్తున్న టైం లో ఆమె మీద అరవడం ఆమె పంపిన మెసేజీ లు పైకి చదవడం లాంటివి చేసాడు.

మిదున్ చేసిన పనికి విసుగు చెంది, పరువు పోయిన వ్యక్తిగా ఫీల్ అయిన ఆమె వెంటనే మిథున్ ని అరెస్ట్  చెయ్యాలని పోలీసుల దగ్గర కాలేజీ లో అతను చేసిన హడావిడి తాలూకా వీడియో కూడా జత చేసి కంప్లైంట్ ఫైల్ చేసింది. దీంతో మిధున్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: