తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించి విజయ్ దేవరకొండ తర్వాత హీరో నానితో ‘ఎవడే సుబ్రమణ్యం’ తో అందరినీ ఆకట్టుకున్నాడు.  ‘పెళ్లిచూపులు’ చిత్రంతో హీరోగా నటించిన విజయ్ తన హావభావాలు..మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు.  రీసెంట్ గా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు. తాజాగా కొందరు అభిమానులు విజయ్‌ను కలిసి రెండు తెలుగు రాష్ట్రల్లో మీ పేరిట ఫ్యాన్స్ అసోసియేషన్‌ను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. 
Image result for pelli chupulu
సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ అసోసియేషన్స్ చాలా ఉంటాయి..ఇక తమ హీరోల సినిమా వచ్చిందంటే చాలు నానా హంగామాలు చేస్తుంటారు. అప్పడప్పుడు హీరో ఫ్యాన్స్ కొట్టుకొని చంపుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.  తాజాగా విజయ్ ఫ్యాన్స్  ఫ్యాన్స్ అసోసియేషన్‌ విషయంపై స్పందించి..చల్లగా తిరస్కరించాడు. 
Image result for arjun reddy
నామీద అభిమానంతో ఇంతదూరం వచ్చారు కాబట్టి ఫోటోలు దిగండి, వెళ్ళండి. అభిమానుల పేరిట హడావిడి నాకు అస్సలు నచ్చదు.  మీరంతా ముందు మీ కెరియర్‌పై దృష్ఠి పెట్టండి. ఇలా హీరోలకు ఫ్యాన్స్ అని చెప్పుకుని మీ భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఏదైనా సాధించడమే మీరు నాకిచ్చే పెద్ద గిఫ్ట్ ’ అంటూ తనదైన శైలిలో వారించాడు వాళ్ళను. 
Image result for arjun reddy fans
చాలామంది హీరోలు మాకింత అభిమానులున్నారు.. నా సినిమాను ఫ్యాన్సే హిట్ చేస్తారు.. అని భుజాలు ఎగరేసే హీరోలకు ధీటుగా విజయ్ దేవరకొండ మాట్లాడిన తీరు అక్కడికొచ్చిన వారిని ఆకట్టుకున్నదట



మరింత సమాచారం తెలుసుకోండి: