మెగా డాటర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక మొదటి సినిమా ‘ఒక మనసు’ ఫ్లాప్ గా మారడంతో ఆమె సినిమాలను మానేసి తిరిగి బుల్లితెర కార్యక్రమాలను చేసుకుంటూ తన కెరియర్ ను కొనసాగిస్తుంది అని అనుకున్నారు అంతా. అయితే ఆమె సినిమాలలోనే కొనసాగాలని నిశ్చ యించుకుని మంచి ప్రాజెక్ట్ గురించి ఎదురు చూస్తూ చాలాకాలం గడిపింది. 

ఇలాంటి పరిస్థుతులలో ఆమెకు కోలీవుడ్ నుంచి ఒక మంచి ఆఫర్ రావడంతో ఇప్పుడు ఆసినిమా పై దృష్టి పెడుతోంది. ఇప్పటికే చాల భాగం షూటింగ్ జరుపుకున్న ఆమూవీ 'ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్' అనే టైటిల్ తో రూపొందింపబడుతోంది. ఈ చిత్రంలో స్టార్ హీరో విజయ్ సేతుపతితో పాటు కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ కూడా నటిస్తున్నాడు. 

ఈమూవీకి ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా ఈసినిమాకు సంబంధించిన నీహారిక లుక్ బయటకు వచ్చింది. సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్న నీహారిక స్టిల్ ను చూసి మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఒంటి నిండా ఆభరణాలతో పూర్తి స్థాయి రాయల్ లుక్ లో కనిపిస్తున్న నిహారిక లుక్ ను చూసిన వారు చాలామంది రాబోయే రోజులలో అనుష్క ఇప్పుడు పోషిస్తున్న మహారాణి పాత్రలను చేసే స్థాయికి నిహారిక ఏడుగుతుందా అన్న కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈసినిమా కథకు సంబంధించి ఎటువంటి లీకులు రాకపోయినా ఒక ఫ్లాష్ బ్యాక్ సన్నివేశానికి సంబంధించి నిహారిక ఇలా రాయల్ లుక్ లో కనిపించబోతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: