ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నంది అవార్డులకు సంబంధించిన విషయంపైనే చర్చలు జరుగుతున్నాయి.  తెలుగు చ‌ల‌న చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌క‌టించిన నంది అవార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నంది అవార్డుల‌ ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు.  అవార్డుల‌కు ఎంపికైన వారే.. అవార్డుల క‌మిటీకి మెంబ‌ర్‌గా ఉండ‌టం క‌న్నా దారుణ‌మైన విష‌యం మ‌రొక‌టి ఉండ‌దంటూ.. బాల‌కృష్ణ‌పై పంచ్ వేశారు.
Image result for chandrababu
తాజాగా నందీ అవార్డులపై సినీ విశ్లేష‌కుడు, న‌టుడు క‌త్తి మ‌హేష్ స్పందిస్తూ.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.   చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డులు (2014) చాలా ప్రాబ్ల‌మేటిక్‌గా ఉన్నాయ‌న్నారు. ఇవాళ నంది అవార్డ్స్ పై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న డిస్క‌ర్ష‌న్‌పై మీ అభిప్రాయ‌మేంట‌ని యాంక‌ర్ ప్ర‌శ్నకు సమాధానం ఇస్తూ..లెజెండ్ ఒక అప్ర‌జాస్వామిక ప్యూడ‌ల్ భావాల్ని, భావ‌జాలాన్ని పెంపొందించే సినిమా.
Image result for nandi awards
ఆ సినిమాకు కూడా అవార్డు రావ‌డంకంటే మ‌రొక దారుణం ఉండ‌ద‌న్నారు. ఈ సినిమాలో బ్రూణ హ‌త్య‌ల సీనేదో ఉంద‌ట‌.. అందుకే ఇచ్చామ‌ని చెప్పుకుంటున్నారంటూ, ఇప్పుడు నేనూ.. చంద్ర‌బాబును పొగిడేస్తే నాకు నంది అవార్డు ఇస్తారోమో!? అంటూ త‌న‌దైన శైలిలో చంద్రబాబు ప్ర‌భుత్వాన్ని ఎద్దేవ చేశారు క‌త్తి మ‌హేష్‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: