ప్రభాస్ ను ప్రపంచం గుర్తించింది. బాహుబలి లాంటి పాత్రను ఐదేళ్ళపాటు సహనంగా పట్టు సడల కుండా నటించటం అనితర సాధ్యం. మన పెరటిచెట్టు మనకు మందు కు పనికి రాదు అనే సామెత విస్తృతంగా వ్యాపించే ఉంది. మన విజయం అంటే మనకి చిన్న చూపే. బాహుబలిగా ప్రభాస్ నటనోన్నతి హిమోన్నతాలను తాకింది. శ్రీమంతుడులో మహేష్ బాబు  ఉత్తమంగా నటించినా, అది ఒక సాధారణ సినిమానే, సాధారణ నటనే.

సంబంధిత చిత్రం

చారిత్రాత్మక చిత్రాలలో నటనకు "చతుర్విధ అభినయాలు" ముఖ్యం. అవే  "ఆహార్యం, ఆంగికం, అభినయం మరియు వాచకం"  వీటిని ఏకబిగిన ప్రధాన పాత్రల్లో అద్భుతం గా పోషించగల సామర్ధ్యం నందమూరి తారక రామారావు (ఎన్ టి ఆర్), సామర్ల వెంకట రంగారావు (ఎస్ వి ఆర్) అనితరసాధ్యంగా నటించి చూపించారు. మంచు మోహన్ బాబు, జూనియర్ ఎన్ టి ఆర్ లు ఆ పాత్రలకు న్యాయం చేశారు. కాని ఈ ఆధునిక యుగంలో బాహుబలి (రెండు సినిమాల్లో) ధీరోదాత్త కాథానాయకునిగా ప్రభాస్  నటించి విశ్వజన సామాన్యాన్ని మెప్పించారు.

nTr svr prabhas కోసం చిత్ర ఫలితం


బాహుబలి సినిమా కారణంగా ప్రభాస్ అంతర్జాతీయ చలనచిత్ర ప్రపంచములో సైతం తనకంటూ ఒక ప్రత్యేక స్థానం విశిష్టతతో కూడిన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే "మేడమ్ టుస్సాడ్స్" వారు ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తమ మ్యూజియం లో పెట్టాలని నిర్ణయించారు. గతం లోనే అంటే భాహుబలి-2 నిర్మాణ సమయం లోనే ప్రభాస్ ను సంప్రదించి ఆయన బాడీ కొలతలు తీసుకున్నారు.

wax statues of modi amitab prabhas కోసం చిత్ర ఫలితం


"మా ఫ్రెండ్ ఫోన్ చేసి మేడమ్ టుస్సాడ్స్ వారు నీ విగ్రహం మ్యూజియంలో పెడతామని చెప్పారని చెప్పగానే నేను నమ్మలేక పోయాను. బాహుబలి లో అద్భుతం జరిగితే ఏదేదో జరుగు తాయని అనుకున్నాం కానీ 'మేడమ్ టుస్సాడ్స్' వారు సైతం వస్తారని అసలు ఊహించలేదు" అని ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. "ఆ సమయంలో నేను బాహుబలి షూటింగులో ఉన్నాను. ఈ విషయం రాజమౌళి గారికి చెప్పగానే చాలా సంతోషపడ్డారు. సౌతిండియా నుండి ఇదే తొలిసారి. ఆ మ్యూజియం వాళ్ళు వచ్చి హాఫ్-డే పాటు కొలతలుతీసుకున్నారు. సూపర్ హీరోలు కెప్టెన్ అమెరికా, స్పైడర్ మ్యాన్ లాంటి విగ్రహాలమధ్యలో మన బాహుబలి ఉంటుందంటే సంతోషంగా అని పించింది" అని ప్రభాస్ తెలిపారు.

wax statues of modi amitab prabhas కోసం చిత్ర ఫలితం


"మీరు హైట్ ఎక్కువ కదా, మీ విగ్రహానికి కాస్త వాక్స్ ఎక్కువ పడుతుంది కదా!" అని యాంకర్ సుమ చమత్కరించడంతో ప్రభాస్ నవ్వేసారు. "కొలతలు తీసుకెళ్లారు కానీ వాళ్లకి ఎంత వాక్స్ అవసరం అవుతుందో తెలియదు. మనల్ని అయితే డబ్బులు అడగలేదు" అని ప్రభాస్ చెప్పుకొచ్చారు.


సంబంధిత చిత్రం

మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను లండన్, బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూరులలో ఏర్పాటు చేసిన తమ మ్యూజియం లలో ప్రతిష్టిస్తున్న సంగతి తెలిసిందే. అచ్చం మనిషిని పోలి ఉండే ఈ విగ్రహాల తయారీకి కూడా ఖర్చు భారీగానే అవుతుంది. ఒక్కో విగ్రహం తయారీకి లక్షా యాభై వేల బ్రిటిష్ పౌండ్లు ఖర్చవు తున్నాయి. అంటే మన కరెన్సీలో ఒక్కో విగ్రహం తయారీకి అయ్యే ఖర్చు దాదాపు కోటిన్నర రూపాయిలు అన్నమాట. 


సంబంధిత చిత్రం


ప్రస్తుతానికి "బాహుబలి స్టార్ - ప్రభాస్" విగ్రహాన్ని "బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం" లో ప్రతిష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ విగ్రహం తయారీ కి అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్టిస్టులు పనిచేస్తారు. విగ్రహాన్ని, ప్రభాస్ ను పక్కపక్కనే పెట్టి కంపేర్ చేస్తే, పోల్చుకోలేనంత పర్‌ఫెక్టుగా ఉంటుంది. కనురెప్పలు, జుట్టు, బాడీ కలర్, ఇలా ప్రతి అంశంలో చాలా కేర్ తీసుకుంటారు. ప్రత్యేకంగా ఆర్టిస్టులు లండన్ నుండి ఇండియాకు పలు సందర్భాల్లో ట్రావెల్ చేసి కొలతలు తీసు కోవడం లాంటివి చేస్తారు. 2017 చివరలో మనం ఈ మైనపు విగ్రహాన్ని చూడబోతున్నాం. "ప్రభాస్ మీరు చాలా గ్రేట్.


ప్రభుత్వాలు బంగారు నందులతో మిమ్మల్ని సత్కరించక పోయినా మీరు మన ప్రధాని నరెంద్ర మోడీ, అద్భుత నటుడు అమితాబ్ బచ్చన్ ప్రక్కన వాక్స్ మ్యూజియంలో కని[పించబోతున్నారు. హాట్స్ ఆఫ్ ది గ్రేట్ ప్రబాస్ - నందులు మీ ఔన్నత్యం ముందు దిగదుడుపే" 


సంబంధిత చిత్రం


అయితే ఇంత ఖర్చు పెట్టి మైనపు విగ్రహాలు తయారు చేయాల్సిన అవసరం వారికి ఏమిటి? ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? అనే డౌట్ మీకు రావొచ్చు. అయితే ఈ ఖర్చుల న్నీ మ్యూజియం నిర్వాహకులే భరిస్తారు. మ్యూజియం నిర్వహణ కోసం సందర్శకుల నుండి టికెట్స్ రూపంలో వసూలు డబ్బు వసూలు చేస్తారు. ఈ క్రింది లింక్ అను సరించండి

http://www.iqlikmovies.com/news/article/2016/10/01/prabhas-waxstatue-madametussauds-bangkok/18196

prabhas as bahubali with devasena కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: