కాకతీయ సామ్రాజ్యం, రుద్రమదేవి శౌర్యపరాక్రమాలను కథలుగా విన్నాం. స్కూలు పాఠాల్లోనూ చదువుకున్నాం. కథలుగా వింటున్నపుడో, పాఠాలుగా చదువుతున్నపుడో -రుద్రమదేవి పరాక్రమ సన్నివేశాలు ఊహాదృశ్యాలుగా మస్తిష్కంపై పరుచు కున్న అనుభూతి చాలామందికి ఉండే ఉంటుంది. అలా అనుభూతించిన వాళ్లలో కచ్చితంగా గుణశేఖర్ కూడా ఉండే ఉంటాడు. దర్శకుడు కనుక అలాంటి అనిర్వచనీయ దృశ్యానుభూతిని తెరకెక్కించాలని కలగన్నాడు.

సంబంధిత చిత్రం


తన కలను ప్రేక్షకుడికి సినిమాగా చూపాలని తాపత్రయపడ్డాడు. "రుద్రమదేవి"  గురించి చరిత్రలో సామాన్యుడికి అందని అనేక విషయాలను శోధించాడు. కష్టపడి కథగా అల్లుకున్నాడు. కథను తెరకెక్కించేందుకు నిర్మాణంలో ఆటుపోట్లు ఎదుర్కొ న్నాడు. భారీ బడ్జెట్ సినిమా కనుక, మరో నిర్మాతను రిస్క్‌లో పెట్టకూడదన్న ఆలోచనతో తనే రిస్క్ చేశాడు. చారిత్రక ఘట్టాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించే ప్రయత్నం కనుక, తాను ఆశించింది వచ్చే వరకూ ఆలస్యాన్నీ భరించాడు. చివరకు రుద్రమ దేవి ని 9 అక్టోబర్ 2015న విడుదల చేసే విషయంలోనూ, గుణశేఖర్‌ను కష్టాలే చుట్టుముట్టాయి. వాటినీ భరించి, మౌనంగా సహించి, చివరకు తను స్వప్నాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు.

rudramadevi team images కోసం చిత్ర ఫలితం


గణపతిదేవుడి పాలనలో సుభిక్షంగా సాగుతున్న కాకతీయ సామ్రాజ్యంపై శత్రురాజులు కన్నేస్తారు. ఆ సమయంలో మహారాజు కు ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల రాజ్యాధి కారానికి అనర్హురాలు. పైగా, శత్రురాజుల దండెత్తే  ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో పుట్టిన బిడ్డను రుద్రమదేవుడిగా రాజ్యానికి పరిచయం చేస్తాడు. అలా మొదలైన కథ  అసలు విషయానికి దూరంగా జన్మ రహస్యం పాయింట్ చుట్టూనే తిరిగింది. రుద్రమదేవి జన్మ రహస్యం బహిర్గతం కావడమే సినిమాకు టర్నింగ్ పాయింట్. తరువాత యుద్ధ వ్యూహాలతో సినిమా పతాక సన్నివేశాలకు వెళ్లిపోయింది. ఖడ్గ విద్యలో నైపుణ్యం, మత్తగజాన్ని లొంగ దీయడం, చుట్టుముట్టిన సైనికులను చీల్చిచెండాడటం, శత్రు దుర్భేద్యమైన ఏడుకోటల నిర్మాణం, పన్నుల రద్దుకు సాహసో పేత నిర్ణయం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, రుద్ర సైన్యం ఏర్పాటులాంటి కీలక సన్ని వేశాలున్నాయి.

rudrama devi nandi awards కోసం చిత్ర ఫలితం


పద్దెనిమిది నెలల పాటు అత్యంత మానసిక ఆర్ధిక ధైహిక శ్రమకోర్చి గుణశేఖర్ నిర్మించారు. నటీనటులంతా తమ శక్తికొలది అద్భుతంగా సహకరిస్తూ నటించారు. విడుదలై న ఈ సినిమా ఘన విజయం సాధించినా ఆర్ధిక నష్టాలు చవిచూశారు. ఈ సినిమాలో కొన్ని సాంకేతిక లోపాలున్నా కథనం పరంగా ఒక అద్భుతమే. తెలుగు ప్రజలకు తెలుగు వీరవనిత చరిత్రను ఒక దృశ్యచిత్రంగా మలచటం లో గుణశేఖర్ కృతకృత్యుడయారనే చెప్పాలి.

rudramadevi team images కోసం చిత్ర ఫలితం


ఈ సినిమాలో మహిళా సాధికారతను అద్భుతంగా కనులకు కట్టినట్లు చూపించారు. ఒక మహిళ ఏవిధంగాను ఒక పురుషుని కంటే తక్కువగాదని నిరూపించిన చారిత్రాత్మక చిత్రానికి ప్రభుత్వం "వినోదపు పన్ను" రద్దు చేయకపోగా, ఏ మాత్రం తెలుగు వారి చరిత్ర ప్రతిబింబించని "గౌతమీ పుత్రశాతకర్ణి" కి ఆ వరం తెలుగు ప్రభుత్వాల నుండి లభించింది. దీనికి నాడెందరో విమర్శల వర్షం కురిపించినా "దున్నపోతు మీద వాన కురిసినట్లు"  ప్రభుత్వం  స్పందించలేదు. 

సంబంధిత చిత్రం


చివరకు ఏ కేటగిరీ లోను "రుద్రమదేవి" కి నంది అవార్డులు ప్రకటించలేదు. దీంతో గుణశేఖర్ స్పందించారు. ఈ అవార్డుల ప్రధానమంతా ఒక కుల, బందు ప్రీతి తో   రాష్ట్రం అంతా  కంపు కొడుతుందని దాంతోనే నంది అవార్డులు ప్రధానం చేయ కుండా పంచుకున్నారని  "అవార్డుల కమిటీ సభ్యులంతా ప్రభుత్వానికి అతి దగ్గరి వారని" వాదిస్తున్నారు.  కాక పోతే 'ఉత్తమ కారక్టర్ నటుడు' గా  గోనగన్నారెడ్డి పాత్ర పోషించిన అల్లు అర్జున్ - స్టార్ కథానాయకునికి ఇచ్చి ఆయన్ని అవమానించారు. ఇది చూశాక అవార్డ్ ఇవ్వక పోయుంటేనే బాగుండి ఉండేదని భావించేలా చేసిన "నంది అవార్డుల కమిటీ కో లేక వెనక ఉన్న ప్రభుత్వానికో ఈ సినిమాపట్ల ధారుణ వివక్ష ఉన్నట్లు ద్యోతకమౌతుందని అనెక మంది భావిస్తున్నారు. 

rudramadevi team images కోసం చిత్ర ఫలితం


తెలుగువారి చరిత్రను  "ఒక కులం కావాలనే కించపరచింది" అనే భావన ప్రజల్లో కూడా వెళ్ళిపోయింది. కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం వీటికి నందులు ఇవ్వకపోయినా సినిమాని ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలలో ఏదో ఒకదానికి ఎంపిక చేయవలసి ఉండాల్సిందని విఙ్జులు ప్రస్తావిస్తున్నారు. అసలు "రుద్రమదేవి పాత్రలో ఒదిగిపోయి నటించిన కథానాయిక అనుష్కాషెట్టి"  కూడా కనీస గౌరవం గుర్తింపు దక్కక పోవటం ఈ జాతి జనం ఎన్నుకున్న- ప్రతినిధులను చూసి - ఈ జాతే సిగ్గుపడవలసి వస్తుంది అంటున్నారు . అందుకే మనం సిగ్గుపడదాం! 


 

rudrama devi nandi awards కోసం చిత్ర ఫలితం

నిన్న ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు.


"ఈసారి అవార్డుల్లో రుద్రమదేవి సినిమాకు నంది అవార్డు రావాల్సింది. రుద్రమదేవి లాంటి మహనీయురాలి జీవితాన్ని సెల్యు లాయిడ్‌కు ఎక్కించడం అంత తేలిక కాదు. అలాంటి సినిమాను గుర్తించాల్సింది. బాహుబలి సినిమా సాంకేతికంగా, వాణిజ్య పరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అందుకు ఆ సినీమా దర్శకుడు రాజమౌళికి సెల్యూట్‌. కానీ, బాహుబలికి జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయింది. ఆ సినిమా చరిత్ర కాదు, సందేశాత్మకం కాదు. అది పూర్తిగా కమర్షియల్‌ సినిమా. ఇప్పుడు కమర్షియల్‌ సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది"   

అని నారాయణమూర్తి పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: