రామ్‌గోపాల్‌ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "బంగారు నందుల అవార్డ్ ల ప్రధానం" పై ఇంకా స్పందించ లేదు ఏమిటబ్బా? అంటూ ఎదురుచూసే తెలుగువారికి ఙ్జానోదయం కలిగిస్తూ తన ట్వీట్ తో స్పందించారు. అందులో ఇది బంగారు నంది అవార్డు ల ప్రధానం కాదని బంగారు నందుల అవార్డుల పంపకం అని అర్ధమైనది.

nandi awards 2017 కోసం చిత్ర ఫలితం

 
నంది అవార్డులపై మొహమాటం లేకుండా - డేరింగ్‌ డైరెక్టర్‌, రామ్‌గోపాల్‌ వర్మ తనదైన ప్రత్యేక శైలిలో స్పందించారు. నంది అవార్డులు ప్రకటించినప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంపై పలువురు చిత్ర రంగ ప్రముఖులు విమర్శలు, వ్యాఖ్యలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం ఇప్పటి వరకూ వీటిపై స్పందించలేదు.


నెట్‌జన్లు, రామ్‌గోపాల్‌ వర్మ అభిమానులు మాత్రం ఆయన స్టేట్‌మెంట్‌ కామెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఏదైనా విషయాన్నికుండబద్దలు కొట్టి నట్లు మాట్లాడే రామ్‌గోపాల్‌ వర్మ నందిఅవార్డుల ప్రధానంపై కూడా తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. అవార్డులపై రామ్‌గోపాల్‌ వర్మ ఏమన్నారో!  ఆయన మాటల్లోనే: 


"అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా! వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్, నాకు తెలిసి ఇలా ఏ మాత్రం కనీసం 1% పక్షపాతం లేకుండా కేవలం ప్రతిభ (మెరిట్) మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ ఈ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు. ఇంత అద్భుతమైన నీతి నిజాయతీ గల "నంది అవార్డు కమిటీ" కి ఖచ్చితంగా  "ఆస్కార్ అవార్డు ఇవ్వాలి" - "వావ్! నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ! ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్"  అంటూ కమిటీ సభ్యులపై సటైర్లు వేశారు.
 

ramgopal varma tweet on ap nandi awards కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: